logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తెలంగాణలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ముగింపు


హైదరాబాద్ AIMA MEDIA ప్రతినిధి: రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికల తొలి దశ నామినేషన్ ప్రక్రియ శనివారంతో ముగిసింది. మొత్తం 189 మండలాలు, 4,236 పంచాయతీలు, 37,440 వార్డులు ఈ దశలో పోలింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి.

అధికారుల సమాచారం ప్రకారం, సర్పంచ్ స్థాయిలో భారీ ఆసక్తి కనిపించింది. 20 వేలకుపైగా సర్పంచ్ అభ్యర్థులు, అలాగే 50 వేలకుపైగా వార్డ్ సభ్యుల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గ్రామాల వారీగా పోటీ ఉత్కంఠగా మారే అవకాశముందని అధికారులు తెలిపారు.

తొలి దశ పోలింగ్ డిసెంబర్ 11న జరుగనుంది. ఈ నేపధ్యంలో ఎన్నికల ఏర్పాట్లు మండలాలు, పంచాయతీలు, గ్రామాల్లో వేగంగా పూర్తి అవుతున్నాయి. భద్రతా చర్యలను బలోపేతం చేయడం కోసం పోలీసు శాఖ ప్రత్యేక ప్రణాళికలు తీసుకుంది.

ఎన్నికలు ప్రశాంతంగా జరగేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

62
1504 views

Comment