logo

వసతి గృహాలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించండి: జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా*

నంద్యాల (AIMA MEDIA): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో వార్డెన్ లు పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు.గురువారం సాయంత్రం అమరావతి నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ రైతుల నుండి ధాన్యం సేకరణ, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సిటిజన్ సర్వే, సంక్షేమ హాస్టళ్లలో పారిశుధ్యం తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి నంద్యాల కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ....జిల్లాలలో ఉన్న బాలికల, బాలుర వసతి గృహాలు, బీసీ హాస్టల్స్ రెసిడెన్షియల్ పాఠశాలలో పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంతో విద్యార్థిని, విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హాస్టల్ వార్డెన్ లు వసతి గృహాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు చేపట్టాలన్నారు.ఇకనుంచి ప్రతి వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేయడం జరుగుతుందని వసతి గృహాలు అపరిశుభ్రంగా ఉన్నట్లయితే వార్దన్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వసతి గృహ సంక్షేమ అధికారులు ఉన్న భవనాలను పరిశుభ్రంగా ఉంచుకొని పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలన్నారు. బాలికల వసతి గృహాలలో పిల్లలు ఉతికిన బట్టలు ఆరేసుకునేందుకు 500 రూపాయల ఖర్చు చేసి ఒక తీగ కట్టలేని పరిస్థితులలో వార్డెన్ లు ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వసతిగృహాల అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ వార్డెన్లకు ఏమాత్రం పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. వార్డెన్లు పిల్లలను తమ బిడ్డల్లా చూసుకుని వారికి కావలసిన మౌలిక వసతులు కల్పించి పరిసర ప్రాంతాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలన్నారు.

4
100 views