logo

నంద్యాల ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శివ బాలి రెడ్డికి జాతీయస్థాయి పురస్కారం.

నంద్యాల (AIMA MEDIA): నంద్యాల ఫిజియోథెరపిస్టుల సంఘం కార్యదర్శి డాక్టర్ శివ బాలి రెడ్డి వారణాసి లో ఉన్న బెనారస్ హిందూ యూనివర్సిటీ మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ లో ఇటీవల జరిగిన రెండు రోజుల అంతర్జాతీయ స్థాయి సదస్సులో సమర్పించిన పరిశోధన పత్రానికి ఉత్తమ వైజ్ఞానిక పరిశోధన పత్రం పురస్కారం ప్రదానం అందుకున్నారు.ఉత్తరప్రదేశ్ మధుర లో ఉన్న సంస్కృతి విశ్వవిద్యాలయం రిహాబిలిటేషన్ సైన్సెస్ శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న నంద్యాలకు చెందిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శివ బాలి రెడ్డి అంతర్జాతీయ సదస్సులో "ఎముకలు, కీళ్ల శస్త్ర చికిత్సల తర్వాత రోగి పునరావాసంలో ఫిజియోథెరపీ పాత్ర"అన్న అంశంపై సమర్పించిన పరిశోధన పత్రానికి ఉత్తమ వైజ్ఞానిక పరిశోధన పత్రం అవార్డు ను నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ సంతోష్ పాండే, సైంటి ఫిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ కృష్ణ శర్మ, నిర్వాహక కార్యదర్శి జ్ఞాన్ పురీ అంద చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ శివ బాలి రెడ్డి కి నంద్యాల జిల్లా ఫిజియోథెరపిస్టుల సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, కన్వీనర్ డాక్టర్ రోహిణి, కోశాధికారి డాక్టర్ జగదీష్ , సంఘం సభ్యులు అభినందనలు తెలిపారు.

6
4 views