logo

శారదా ట్రస్ట్ జలధార స్కీం తో గిరి గ్రామాలకు త్రాగునీరు

అరకులోయ మండలం, సుంకరమెట్ట పంచాయతీ కిన్నంగుడ, కే బెడ్డగుడ గ్రామంలో శారద ట్రస్ట్ ఆధ్వర్యంలో దివిస్ లేబరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం సౌజన్యంతో జలధార వాటర్ స్కీమ్ ప్రారంభించారు. గిరిజన ప్రాంతంలో గిరిజనుల ఆరోగ్యంగా ఉండాలని వారి ఆరోగ్యమే మాకు మహాభాగ్యమని ముఖ్యఅతిథిగా హజరైన దివిస్ లేబరేటరీ జనరల్ మేనేజర్ వై కోటేశ్వరరావు అన్నారు. గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించినందుకు ఆయా గ్రామస్తులు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో శారదా ట్రస్ట్ మెంబర్స్ కె.చిన్నం నాయుడు, దామోదర్, సుంకరమెట్ట సర్పంచ్ గెమ్మెలి చిన్నబాబు, సిహెచ్ గురుమూర్తి, పి.నానిబాబు గ్రామ వార్డు మెంబర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.

4
100 views