logo

రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించిన రోలుగుంట జెడ్పిహెచ్‌ఎస్

రోలుగుంట, నవంబర్ 26:
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రోలుగుంటలో రాజ్యాంగ దినోత్సవాన్ని (సోషల్ డే) ఘనంగా నిర్వహించారు. కార్యక్రమ ప్రారంభంలో విద్యార్థులతో రాజ్యాంగ ప్రవేశ పీఠిక (ప్రియాంబుల్)ను ప్రతిజ్ఞ చేయించడం ద్వారా కార్యక్రమానికి శుభారంభం పలికారు.
తదనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాక్ అసెంబ్లీ లైవ్ ప్రోగ్రామ్‌ను విద్యార్థులకు చూపించారు. ఆపై పాఠశాలలోనే విద్యార్థుల తో ఒక మాక్ అసెంబ్లీ నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్య విధానాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీయడానికి చిత్రలేఖనం, వ్యాసరచన, డిబేట్ పోటీలను నిర్వహించారు.
సాయంత్రం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ ప్రాముఖ్యత, పౌరుల హక్కులు–కర్తవ్యాలపై ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రసంగాలు చేసి విద్యార్థుల్లో రాజ్యాంగంపై అవగాహన పెంపొందించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు మరియు బహుమతి ప్రదానాలతో సోషల్ డే ఉత్సాహవంతంగా కొనసాగింది.
ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ టి.వి. శేషగిరిరావు అధ్యక్షత వహించారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు పి. మాలతి కార్యక్రమాన్ని నిర్వహించగా, ఇటీవలే చేరిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ముత్యాల నాయుడు, రాముతల్లి తదితరులు సమన్వయం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కార్యక్రమానికి, విశేషంగా స్పందించారు.

13
601 views