logo

వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలలో విజేతలకు పురస్కారాలు అందజేసిన జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి.

నంద్యాల (AIMA MEDIA): బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ... ఈ పోటీల ద్వారా పిల్లల్లో రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలు, పౌర హక్కులు, కర్తవ్యాల పట్ల అవగాహన పెంపొందించడం లక్ష్యమని తెలిపారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి మొత్తం ముగ్గురు విద్యార్థులను ఉత్తమ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసినట్లు వివరించారు.విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గం నుంచి ఎంపికైన ఒక ఉత్తమ విద్యార్థి రాష్ట్ర స్థాయిలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డు మరియు ప్రశంసాపత్రం పొందారన్నారు. మిగిలిన ఇద్దరు విద్యార్థులకు జిల్లాస్థాయిలోనే జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు మరియు ప్రశంసాపత్రాలు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు శాసనసభ కార్యకలాపాలు ఎలా సాగుతాయో నమూనా సేకరించి మాక్ అసెంబ్లీలో పాల్గొన్నారు.ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లోని ఆర్. నాగమోక్షిత, ఏపీ మోడల్ స్కూల్ కోటకందు కోటకందుకూరు విద్యార్థిని కె. వెంకట హన్సిక, నందికొట్కూరులో జడ్పీహెచ్ఎస్ కొణిదెల విద్యార్థినికె. వైష్ణవి,శ్రీశైలంలో జడ్.పి.హెచ్.ఎస్ గర్ల్స్ ఆత్మకూరు విద్యార్థిని జి. లక్ష్మీ, ఏపీ మోడల్ స్కూల్ వెలుగోడు విద్యార్థిని ఎ. చరిత, నంద్యాలలోని టేక్కే లోని మున్సిపల్ హైస్కూల్ విద్యార్థిని ఎం. శివ సాయి, ఏపీ మోడల్ స్కూల్ గోస్పాడు విద్యార్థిని ఎన్. అవని,  డోన్ లోని ఈరోజు రేపు కేజీబీవీ ప్యాపిలి విద్యార్థిని హెచ్.లాస్య, జడ్పీ గర్ల్స్ హై స్కూల్ డోన్ విద్యార్థిని అల్మాస్ హఫియా, బనగానపల్లిలోని జడ్పీ  హై స్కూల్ విద్యార్థిని మధు కల్పన కేజీబీవీ సంజామల విద్యార్థిని విష్ణు ప్రియ, పాణ్యంలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని ఎస్ ప్రవల్లిక వున్నారు.

0
267 views