logo

రోలుగుంట హైస్కూల్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రోలుగుంట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శేషగిరిరావు ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ 19 49 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజుని, 2015 తేదీన నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవం గా అధికారికంగా ప్రకటించారని.ఇదే రోజు భారత రాజ్యాంగ ప్రతిష్ఠాత్మకాన్ని మరియు పౌరుల హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంపొందించుటకు ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని విద్యార్థులచే మాక్ అసెంబ్లీ నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఈ మాక్క అసెంబ్లీ కార్యక్రమంలో, ఎమ్మెల్యే గారు, స్పీకర్ గాను, ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నేతగాను, వ్యవహరించి, అసెంబ్లీ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. కార్యక్రమంలో పాఠశాలలో పనిచేస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయురాలు పీవీఎం నాగజ్యోతి, కిరణ్ మాస్టారు, వ్యాయామ ఉపాధ్యాయులు గోవిందరావు, మరియు మిగిలిన ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

11
1227 views
  
1 shares