logo

మదనపల్లె లేని అన్నమయ్య జిల్లాను ఊహించడానికే బాధగా ఉంది. Ex Mla శ్రీకాంత్ రెడ్డి

రాయచోటిపైరాజకీయ ప్రతీకారం.. అన్యాయ విభజనపై మండిపడ్డ శ్రీకాంత్ రెడ్డి..

రెండు మూడు నియోజక వర్గాలతో జిల్లా కేంద్రం ఏర్పాటు చేసి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతున్న కూటమి ప్రభుత్వం...

రెండేళ్ల క్రితమే రూ 100 కోట్ల నిధులతో అప్రూవ్ అయిన రాయచోటి కలెక్టరేట్… ఒకపైసా మంజూరు చేయని ప్రభుత్వం...

గత జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేస్తుంటే నానా యాగీ చేసిన కూటమి నేతలు...

అమరావతి నిర్మాణానికి పెట్టే ఖర్చులో 0.1 శాతం నిధులనునైనా ఈ ప్రాంత అభివృద్ధికి ఖర్చుపెట్టక పోవడం ఏంటి?

అన్నమయ్య జిల్లాను యధాతధంగా ఉంచండి..

వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్

అన్నమయ్య జిల్లాను అడ్డుగోలుగా విభజించి , రాయచోటి పై రాజకీయ ప్రతాపం చూపుతున్నారని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గత జగన్ ప్రభుత్వం పార్లమెంట్ ప్రాతిపదికన జిల్లాలను ఏర్పాటు చేసి, ఎంతో పారదర్శకం గా 13 జిల్లాల నుంచి 26 జిల్లాలకు పెంచితే అడ్డుగోలుగా జిల్లాల పునర్విభజన చేశారని గగ్గోలు పెట్టి విమర్శలు చేసిన వారే నేడు అప్పుడు ఏర్పాటు చేసిన జిల్లాలనే కుదించేసి,కొత్తగా 3 జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. గతంలో రాయచోటి జిల్లా కేంద్రం ఏర్పాటుకు ఎవ్వరి కృషిఏమీ లేదని, భౌగోళికంగా ఉండబట్టే జిల్లా వచ్చిందని కొంతమంది విమర్శలు చేశారన్నారు. కనీసం రాయచోటి ప్రాంతంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయం, డి ఎస్ పి కార్యాలయంలు కూడా లేని పరిస్థితుల్లో జిల్లా కేంద్రాన్ని చేస్తే ఆలోచనలు లేకుండా విమర్శలు చేశారన్నారు. ఈ రోజు మరీ భౌగోళికంగా రాయచోటి ఒకప్రక్కకు అయిపోయిందన్నారు. మదనపల్లె ను 4 నియోజక వర్గాలతో జిల్లా కేంద్రం చేసి , రాయచోటి నుంచి మదనపల్లెను విభజించి ఏమి గొప్ప సాధించారన్నారు. మదనపల్లె లేని అన్నమయ్య జిల్లాను ఊహించడానికే బాధగా ఉందన్నారు. రాయచోటి ఇప్పుడు ఒక కార్నర్ కు వచ్చిందన్నారు. అటుప్రక్కనున్న రాజంపేట, కోడూరు ప్రాంతాల ప్రజలు కార్నర్ అయిన రాయచోటి పై వ్యతిరేక భావాలు వ్యక్తం చేస్తున్నారన్నారు.ఒక జిల్లా కేంద్రం ఆరు,లేక ఏడు నియోజక వర్గాలుతో 30 మండలాలకు పైగా ఉంటే అక్కడికి వచ్చే కలెక్టర్ లు, ఎస్ పి లు శ్రద్ధగా,బాధ్యతగా విధులు నిర్వహిస్తారన్నారు. రెండుకు, మూడు నియోజక వర్గాలతో జిల్లా కేంద్రం ఏర్పాటు చేసి ప్రజల మధ్యన వైషమ్యాలు పెంచడం ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదమన్నారు.

*అన్నమయ్య జిల్లాపైనే ఎందుకంత వివక్ష..కక్ష...*
ఎన్నికల సమయంలో హిందూపురంను జిల్లా కేంద్రం చేస్తామని చెప్పారే.. సత్యసాయి జిల్లాను ఎందుకు విభజించలేదన్నారు. ఎందుకు మీకు అన్నమయ్య జిల్లాపైనే ఎందుకంత వివక్ష..కక్ష అని అని ఆయన ప్రశ్నించారు. వెనుక బడిన ప్రాంత ప్రాతిపదికగా, సెంటర్లీ లోకేటెడ్ ప్రాంతంగా ఆ రోజు రాయచోటి లో ఎరకమైన సదుపాయాలు ఉన్నాయో అనేక సార్లు జిల్లాల పునర్విభజన కమిటీ దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.జిల్లాల పునర్విభజన కమిటీ సభ్యులు నీలం సాహ్ని, కృష్ణబాబు, జవహర్ రెడ్డి తదితర సభ్యులందరి దగ్గరికి వెళ్లి ఈ నియోజక వర్గంలో ఖాళీ స్థలాలు, వెనుకబాటు తనాన్ని వివరించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.

*ఏ జిల్లా కేంద్రానికి తీసిపోని విధంగా ప్రభుత్వ భవనాల లోనే ప్రభుత్వ కార్యాల యాలను ఏర్పాటు చేశాం...*
కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలలో ఏ జిల్లా కేంద్రానికి తీసిపోని విధంగా కార్యాలయాల న్నింటినీ ప్రభుత్వ భవనాలలో నే ఏర్పాటు చేయించి, అతి స్వల్ప కాలంలోనే 75 వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహింప చేయడంతో ఇది ఎలా సాధ్యపడిందని అందరూ రాయచోటి వైపు చూసేలా కృషి చేశామన్నారు. ఇప్పుడు కేవలం రెండు,మూడు నియోజక వర్గాలకు జిల్లా కేంద్రంగా ఉంటుందని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఒక రాయచోటి వాసిగా ఎంతో బాధపడుతు న్నానన్నారు. కొందరు రాజకీయ విమర్శలు చేస్తూ,నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉండొచ్చు కానీ ,ప్రతి ఒక్కదానికి స్పష్టమైన సమాధానాలు చెప్పుతామన్నారు.ఎటువంటి స్వార్థాలకు పోకుండా, కేవలం రాయచోటిని మంచి పట్టణంగా తీర్చిదిద్దాలని, యూనివర్సిటీ ఏర్పాటుకు వంద ఎకరాలు సేకరింప చేశామని, యువతకు ఉపయోగ పడాలని, ఏపిఐఐసి కోసం శిబ్యాల దగ్గర 500 ఎకరాల భూములను సేకరణ, తదితర ఎన్నో అభివృద్ధి పనులను భవిష్యత్తు కోసం ఆలోచనలు చేశామన్నారు. రాజకీయాలలో హుందాతనం వుండాలి కానీ తెలుసు కోకుండా, అడ్డుగోలుగా విమర్శలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ముందుగా ఈ ప్రాంతానికి ఎటువంటి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇందుకోసం ఎవ్వరితోనైనా కలసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

*జగనన్న కాలనీ భూములపై చౌకబారు విమర్శలు...*
నారాయణ రెడ్డిగారిపల్లె జగనన్న కాలనీలో రైతులనుంచి రూ 50 లక్షల రూపాయలకు పొలాలును ప్రభుత్వం నుంచి కొనింపచేశారని , ఏవోవో ఆరోపణలు చేశారన్నారు. భూసేకరణకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి చెల్లించ కుండా పట్టణ పేదలు 6 వేల మందికి పక్కా గృహాలు ఇవ్వడం రాష్ట్రంలోనే రాయచోటి లోనే జరిగిందన్నారు. స్థలాల కోసం ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి చెల్లింపులు కూడా రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగాఎక్కడా జరగలేదన్నారు. రాయచోటి రూరల్ మండలం,ఇతర మండలాలలోనూ మెయిన్ రోడ్లపైనే పక్కా గృహాలను మంజూరు చేసిన ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.నీతికి, నిజాయితీగా జగనన్న కాలనీలు నిలుస్తాయన్నారు.మంచి పనులపై కూడా రాజకీయ విమర్శలు చేస్తున్నారంటే వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

*జగన్ ప్రభుత్వంలో పారదర్శకంగా జిల్లాల విభజన జరిగింది...* ఒక్కటే ఆలోచన.. ఒక్కటే బాధాకరమని రాష్ట్రంలో ఏర్పడినటువంటి మిగిలిన జిల్లాలు ఏవీ విభజన కాలేదని, కేవలం రెండు కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తున్నా రన్నారు.గతంలో అన్నమయ్య, సత్యసాయి, ఎన్ టి రామారావు, అంబేద్కర్, పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు, మన్యం మహనీయులును చిరస్థాయిగా గుర్తుపెట్టుకునేలా వాళ్ళ పేర్లతో జిల్లాల విభజన జరిగిందని, అప్పుడు అడ్డుగోలుగా జిల్లాల విభజన జరగలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వమే అడ్డుగోలుగా జిల్లాలను విభజిస్తున్నా రన్నారు.ఒక జిల్లాను రెండు మూడు నియోజక వర్గాలకు పరిమితం చేయడం, సెంటర్లీ లోకేటెడ్ కు అర్థం లేకుండా అన్నమయ్య జిల్లాను విభజించడం బాధాకర మన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచనలు చేయాలని, పుంగనూరును ఇక్కడికే కలిపి ఏడు నియోజక వర్గాలతో అన్నమయ్య జిల్లాను యధాతధంగా ఉంచితే కలెక్టర్ , ఎస్ పి, జాయింట్ కలెక్టర్ లు శ్రద్దగా పనిచేస్తారని, జిల్లా కేంద్రం అభివృద్ధి చెందేందుకు బాటలు పడతాయన్నారు.

*రాయచోటికి స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలి — యూనివర్సిటీ వెంటనే మంజూరు చేయాలి...*
రాష్ట్రంలో మూడు ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయాలని గత జగన్ ప్రభుత్వం ఆలోచనలు ను చేసిందన్నారు. అమరావతి నుంచి ఏది వెళ్లనీయకుండా కూటమి నేతలు న్యాయ స్థానాలకు వెళ్లి రాయలసీమ కు హైకోర్టు రానీయ కుండా ,ఎన్నో చేశారన్నారు. ఎంతో బాధవున్నా ఓపికతో భరిస్తూ వస్తున్నామని, ఉన్నటువంటి జిల్లాను కూడా విభజించా రన్నారు. అమరావతి లో కొన్ని లక్షల కోట్లతో భవనాలు నిర్మిస్తున్నారని, ఒక చదరపు అడుగు కు రూ 10 వేలు,రూ 15 వేలు ను ఖర్చు పెడుతున్నారన్నారు. బేస్మెంట్ కోసమే నలభై శాతం నిధులను ఖర్చు పెడుతున్నారే.. అన్ని జిల్లాల ప్రజల సొమ్మును ఖర్చు పెట్టుతుంటే మాకు బాధ ఉండదా అని అన్నారు. రాయచోటిలో జిల్లా కలెక్టరేట్ నిర్మాణానికి రూ 100 కోట్ల నిధులతో రెండేళ్ల క్రితం అప్రూవల్ అయి..భూ సేకరణ కూడా పూర్తి అయిందన్నారు. అమరావతి అభివృద్ధికి ఖర్చు పెడుతున్న వాటిలో 0.1 శాతమైనా నిధులు మంజూరు చేస్తే ఈ పనులు పూర్తయి ఉండేవి కదా అని ఆయన ప్రశించారు. ఒకరికి ఒక న్యాయం,మరొకరికి ఒక న్యాయం అనేలా వుండకూడద న్నారు.ఎవరి ప్రాంత అభివృద్ధి కోసం వారికి తపన ఉంటుందన్నారు. రాజకీయ మనుగడ కోసం ఇలాంటి పక్రియ చేయడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంతానికి స్పెషల్ ప్యాకేజీ క్రింద ఇస్తారో..రాయచోటికి యూనివర్సిటీ వెంటనే ఇవ్వాలని,ఇప్పటికే మంజూరైన కలెక్టర్ బంగ్లా, ఎస్ పి బంగ్లా ల నిర్మాణాలుకు వెంటనే నిధులు మంజూరు చేయాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.అన్నమయ్య జిల్లాను యధాతధంగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.తాను హుందాగా రాజకీయాలు చేస్తానని,ప్రజల కోసం ఎన్ని అవమానాలునైనా భరిస్తానని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

4
111 views