logo

బొట్లపేటలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే కూన రవికుమార్

AIMA న్యూస్ శ్రీకాకుళం :
పొందూరు మండలంలోని తండ్యం పంచాయతీ పరిధిలోని బొట్లపేట గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఆమదాలవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు బుధవారం ప్రారంభించారు. ఈ ప్రాంత ప్రజలకు శుద్ధి చేసిన తాగునీటిని అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్లాంట్ వ్యవస్థాపకులు మేక కిరణ్ చందు గారు ప్రధాన ఉద్దేశ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

✅ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణం కలుషిత నీరనే పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వం శుద్ధమైన తాగునీటి సదుపాయాలను ప్రతి గ్రామానికి అందించాలనే దిశగా కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ ప్లాంట్ ప్రారంభంతో బొట్లపేట గ్రామం మరియు పరిసర గ్రామాలకు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి అవసరాలు పూర్తిగా తీరనున్నాయని తెలిపారు.

స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

21
409 views