logo

సర్వీస్ రివాల్వర్ ను తాకట్టు పెట్టిన అంబర్ పేట్ ఎస్ఐ?*

జర్నలిస్టు : మాకోటీ మహేష్

హైదరాబాద్: నవంబర్ 26
అంబర్ పేట ఎస్ఐ భాను ప్రకాష్ సర్వీస్ రివాల్వర్ కనిపించడంలేదు. ఎస్ఐ భాను నిర్లక్ష్యంగా వ్యవహ రించి తన సర్వీస్ రివాల్వర్ ను పోగొట్టుకున్నాడు. గతంలో ఇదే పోలీస్ స్టేషన్ లో డిఎస్ఐగా భాను విధులు నిర్వహించాడు. డిఎస్ఐ గా ఉన్న సమయంలో పలు కేసులకు సంబంధించి రికవరీ చేసిన దొంగ బంగారాన్ని కుదువ పెట్టినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

బంగారంతో పాటు రివాల్వర్ ను సైతం డబ్బుల కోసం తాకట్టు పెట్టినట్లు అనుమానాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందు లతోనే ఎస్సై ఈ పని చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బెట్టింగ్ లో భారీగా డబ్బు పోగొట్టుకొని తన సర్వీస్ రివాల్వర్ కూడా తాకట్టు పెట్టి ఉంటారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నా యి.

ఎస్ఐ భాను ప్రకాష్ పై అంబర్ పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ భాను కుటుంబ సభ్యులు, స్నేహితులను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. భాను ప్రకాష్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు.

0
0 views