దివ్యాంగుల వారోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన దివ్యాంగుల కర్నూలు ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ రయిస్ ఫాతిమా.
కర్నూల్ (AIMA MEDIA): డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ (DRWA/AP) ఆధ్వర్యంలో డిసెంబర్ 9వ తేదీన నంద్యాలలోని వివేకానంద ఆడిటోరియం నందు నిర్వహించబోతున్న 66వ దివ్యాంగుల వారోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను కర్నూలు లోనే వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో కర్నూలు మరియు నంద్యాల ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి రయిస్ ఫాతిమా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సూపరిండెడ్ సాల్మన్, డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు డిపి మస్తాన్ వలి, ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, సభ్యులు షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.