logo

*విజయనగరం సిరిమాను ఉత్సవం: భద్రతా లోపంపై విచారణకు ఆదేశం*


విజయనగరం పైడితల్లి సిరిమాను ఉత్సవం సందర్భంగా శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు ప్రొటోకాల్‌, భద్రత లోపంపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక పంపాలని జిఎడి ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముఖేష్‌కుమార్‌ మీనా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
సిరిమాను ఉత్సవం సందర్భంగా వేదికను డీసీసీబీ నుంచి సిటీ బ్యాంకుకు అధికారులు మార్చారు.
సిరిమాను ఉత్సవం సందర్భంగా బొత్స సత్యనారాయణ కుటుంబం కూర్చున్న వేదిక కుప్పకూలింది.
ఎమ్మెల్సీ సురేష్ బాబు, ఒక పోలీసు అధికారి, మరో బాలిక గాయపడ్డారు.
భద్రతా లోపాలపై బొత్స సత్యనారాయణ ఫిర్యాదు చేశారు.

28
1206 views