ప్రముఖ నటుడు శ్రీ అక్కినేని నాగార్జున గారి ఆహ్వానం మేరకు అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ మరియు స్టూడియోను సందర్శించడం జరిగింది.
ప్రముఖ నటుడు శ్రీ అక్కినేని నాగార్జున గారి ఆహ్వానం మేరకు అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ మరియు స్టూడియోను సందర్శించడం జరిగింది.
సినీ రంగానికి అపారమైన సేవలు అందించిన మహానటుడు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహానికి నివాళులు అర్పించాను.
తెలుగు ప్రేక్షకుల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించిన ANR గారి క్రమశిక్షణ, కృషి మరియు విలువలు నేటి తరానికి ప్రేరణగా ఉంటాయి.
అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న శిక్షణా కార్యక్రమాలు, ఆధునిక సాంకేతిక వసతులను పరిశీలించినప్పుడు ఎంతో ఆనందం కలిగింది.
ప్రపంచ స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
మన తెలంగాణ యువతకు సినిమా, మీడియా, డిజిటల్ మరియు క్రియేటివ్ రంగాల్లో మరింత అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది.