logo

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో నలుగురికి జరిమాన విధించిన కోర్టు

బొబ్బిలి పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె సతీష్ కుమార్ వారి నేతృత్వంలో బొబ్బిలి ట్రాఫిక్ ఎస్.ఐ. జునా ప్రసాద్ నిర్వహించిన వెహికల్ చెకింగ్ లో మద్యం సేవించి ఆటోను నడుపుతున్న ఆదంకి శంకరరావు సన్నాఫ్ నారాయణస్వామి, టి ఆర్ కాలనీ, బొబ్బిలి పట్టణం చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని గౌరవ స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్, బొబ్బిలి వారి ఎదుట హాజరు పరచగా సదరు నిందితునికి మూడు రోజులపాటు జైలు శిక్ష విధించి రిమాండ్ కు పంపడమైనది. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పట్టుబడిన మరో నలుగురు నిందితులకు ఒక్కొక్కరికి ఐదువేల రూపాయలు చొప్పున కోర్టు వారిచే జరిమాన విధించబడినది. కావున బొబ్బిలి పట్టణ, మండల ప్రజల మద్య మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, జైలు శిక్ష కూడా విధించబడుతుందని బొబ్బిలి పట్టణ సి.ఐ. కె సతీష్ కుమార్ తెలియజేశారు.

0
0 views