శ్రీశ్రీశ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర 28వ షష్టి మహోత్సవం...
విశాఖపట్నం (ఎన్ఏడి కొత్త రోడ్ )
శ్రీశ్రీశ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 28వ సుబ్రహ్మణ్యేశ్వర షష్టి మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు అభిషేకాలు,దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. తదనంతరం వేద పండితుల చేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి కళ్యాణ మహోత్సవంలో సుమారుగా 108 మంది దంపతులచే కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. కళ్యాణం చేసుకున్న భక్తులు స్వామివారి దర్శనం తరం తీర్థప్రసాదాలు అందజేస్తామని ఆలయ కమిటీ వారు తెలియజేశారు. మధ్యాహ్నం స్వామి వారి అన్న సమారాధన పెద్ద ఎత్తున అందించడం జరుగుతుంది అని తెలిపారు. ఏ కార్యక్రమంలో ఆలయ కమిటీ కోశాధికారి సతీష్,శ్యామ్ ఇతర కమిటీ సభ్యులు,భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.