logo

నందిగామ నియోజకవర్గ రహదారుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ని కలసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య .

నందిగామ నియోజకవర్గ రహదారుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ని కలసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య .

క్రౌన్ హ్యూమన్ రైట్స్ నందిగామ నవంబర్ 25;

మంగళవారం నాడు వెలగపూడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ (చిన్ని) మరియు జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నందిగామ నియోజకవర్గంలో ప్రస్తుత రహదారులు మరియు వంతెనల పరిస్థితిని మంత్రి దృష్టికి తీసుకెళ్లిన తంగిరాల సౌమ్య , శిథిలావస్థలో ఉన్న ప్రధాన రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో అనుసంధాన మార్గాలు, వంతెనల మరమ్మతుల అవసరాన్ని వివరించారు. ప్రజలకు సులభ రవాణా సౌకర్యం అందించాలంటే తక్షణమే రహదారుల నిర్మాణాలు, అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని మంత్రిను కోరారు.నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రోడ్లు కీలకమని పేర్కొన్న ఆమె, త్వరితగతిన పనులు ప్రారంభించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

0
24 views