logo

నూనేపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద చిరు వ్యాపారులకు న్యాయం జరిగేలా చూడాలని మంత్రి కి సిఐటియు వినతి

నంద్యాల,నవంబర్25, AIMA MEDIA ప్రతినిధి ఆర్ ఎన్ రెడ్డి:
నంద్యాల నూనెపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఉన్న చిరు వ్యాపారస్తుల జీవనం కోసం న్యాయం చెయ్యాలని కోరుతూ న్యాయశాఖ మరియు ముస్లిం మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎం.డి. ఫరూక్ గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు తోటమద్దులు, శ్రీనివాసమూర్తి,సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్,సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు కే మహమ్మద్ గౌస్, పి వెంకట లింగం లతోపాటు టిడిపి సీనియర్ నాయకులు మిద్దె. ఉసేని, నూనెపల్లె టీడీపీ మాజీ కౌన్సిలర్ శివ శంకర యాదవ్, గుద్దేటి వెంకటేశ్వర్లు,బ్యాంకు తిమ్మయ్య లు పాల్గొన్నారు.*

*అనంతరం వారు నూనెపల్లె ఫ్లైఓవర్ ప్రారంభమైన నాటి 30 సంవత్సరాల నుండి చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నంద్యాల పట్టణ అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయడం జరిగింది. అక్కడి ప్రాంతంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం అనుకుంటుందని ప్రజలంతా చర్చించుకుంటున్న నేపథ్యంలో బ్రిడ్జి కింద చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని కుటుంబ పోషణ కోసం గడుపుతున్న వారి జీవితాలు రోడ్డున పడే అవకాశం ఉంది. కావున వారందరి కోసం కర్నూలు లో మాదిరిగా రాబోయే కాలంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమంలో గదులు నిర్మించి వారికే ఇవ్వాలని ఆలా చెయ్యడం వల్ల మున్సిపాలిటీకి కూడా కొంత ఆదాయం సమకూరే అవకాశం ఉంది. నూనెపల్లె -కోవెలకుంట్ల జంక్షన్ నుండి బ్రిడ్జి కింద పార్కు ని ఏర్పాటు చెయ్యాలని, అదేవిధంగా నూనెపల్లె ప్రాంత ప్రజల సౌకర్యార్థం కోసం ప్రభుత్వమే లైబ్రరీని ఏర్పాటు చేయాలని, ఆటోలు నిలుపుకునేందుకు స్టాండ్ కోసం స్థలం కేటాయించాలని, అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేసి ప్రజల సౌకర్యార్థాలను తీర్చాలని కోరారు. అనంతరం మంత్రి ఫరూక్ గారు స్పందిస్తూ మీరు ఇచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని అధికారులతో చర్చించి ఎలాగైన న్యాయం జరిగేలా చూస్తానని నూనెపల్లె ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని అన్నారు.

12
994 views