logo

పంచ సూత్రాలతో రైతన్న మీకోసం




పంచ సూత్రాలతో రైతులను అభివృద్ధి కోసం ఇంటింటా రైతుల సర్వే నిర్వహించి రాబోయే మూడు సీజన్లకు వ్యవసాయ ప్రణాళికను రూపొందించే లక్ష్యంగా రైతన్న మీకోసం కార్యక్రమం ఉపయోగపడుతుందని సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ అన్నారు మోసూరు గ్రామంలో రైతుల సర్వే కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ నీటి వనరుల సద్వినియోగం అభివృద్ధి, అధిక డిమాండ్ కలిగిన పంటల అభివృద్ధి, వ్యవసాయంలో సాంకేతికత, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ పథకాల అమలు వంటి ఐదు పంచ సూత్రాల తో రైతులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇంటింటి సర్వే శనివారం అనగా 29వ తారీకు వరకు జరపబడుతుందని రైతులు అందరూ తమ భూముల ఆరోగ్యాన్ని పంటల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఖర్చులు తగ్గిస్తూ దిగుబడులు పెంచే దిశగా సూచనలు అందించాలని తెలిపారు వ్యవసాయ యాంత్రికరణలో ఎలాంటి పరికరాలు ఉంటే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందో తెలపాలని ప్రకృతి సేద్యం విస్తరించాలంటే తీసుకోవలసిన చర్యలు రసాయన యూరియా వినియోగాన్ని తగ్గించి నానో యూరియా వినియోగాన్ని పెంచాలని అంతర పంటలు పంట మార్పిడి విధానాలను అవలంబించాలని కోరారు రైతులందరూ APAIMS యాప్ ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకోవాలని, ఈ యాప్ ద్వారా రైతులు తమ భూముల వివరాలను పంటల వివరాలను వాతావరణ పరిస్థితులను వ్యవసాయ అధికారుల ఫోన్ నెంబర్లను వివిధ పంటల యాజమాన్య పద్ధతులను వాతావరణాన్ని బట్టి ఆశించే పురుగులు తెగుళ్ల వివరాలను తెలుసుకోవచ్చని రైతుకి ఈ యాప్ ఎంతగానో సహకరిస్తుందని తెలిపారు. కాబట్టి గ్రామ వ్యవసాయ సహాయకులు ఇంటింటికి వచ్చి సర్వే చేసినప్పుడు వారికి తప్పనిసరిగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాంచాలి సర్పంచ్ యుగంధర్, పీఏసీఎస్ ప్రెసిడెంట్ సింహాచలం మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరసింగరావు వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

42
2931 views