
బుగ్గారం మండలంలో గంజాయి పట్టివేత
- ఇద్దరు గంజాయి ప్రియుల అరెస్ట్
- అంతర్ రాష్ట్ర వాసులుగా గుర్తించిన పోలీసులు
బుగ్గారం మండలంలో గంజాయి పట్టివేత
- ఇద్దరు గంజాయి ప్రియుల అరెస్ట్
- అంతర్ రాష్ట్ర వాసులుగా గుర్తించిన పోలీసులు
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామంలోని పల్లె ప్రకృతి తివనం నందు సోమవారం ఇద్దరు గంజాయి ప్రియులను పట్టుకున్నట్లు బుగ్గారం ఎస్సై జి.సతీష్ తెలిపారు. వీరి నుండి 60 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ఇద్దరు వ్యక్తులు అంతర్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించామని ఆయన వివరించారు.
ఎ1. సూరజ్ కుమార్, తండ్రి పేరు: రామ్ విలాస్ మహతో, వయస్సు: 18 సంవత్సరాలు, కులం: మహతో, వృత్తి: పని (లేబర్), నివాసం: వార్డ్ నెం.17, అలౌలి, ఖగారియా జిల్లా, బీహార్ రాష్ట్రం, ఎ2. రాహుల్ కుమార్, తండ్రి పేరు సాగర్ నోనియా, వయస్సు: 22 సంవత్సరాలు, కులం: మహతో, వృత్తి: పని (లేబర్), నివాసం: అలౌలి, ఖగారియా జిల్లా, బీహార్ రాష్ట్రం - 848203 లుగా గుర్తించామని ఎస్సై జి.సతీష్ పేర్కొన్నారు.
వీరిద్దరు యువకులు గంజాయి తాగుతూ పట్టుబడడం జరిగిందన్నారు. ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి 60 గ్రాముల గంజాయి పట్టుకొని, ఎన్.డి.పి.సి. చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు.
బుగ్గారం మండలంలో గంజాయి తాగినా, అమ్మినా, గంజాయి కలిగి ఉన్నా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బుగ్గారం మండల ప్రజలు గంజాయి గురించి సమాచారాన్ని పోలీసులకు అందించాలని ఆయన కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడుతాయన్నారు.