ఘనంగా అయ్యప్ప స్వామి మెట్ల పూజ
కడప జిల్లా:: కలసపాడు మండలం తెల్లపాడు గ్రామంలో కర్నాటి మధు రెడ్డి రమణారెడ్డి గురు స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మెట్ల పూజ సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ప్రతిమ విగ్రహానికి పంచామృతాభిషేకాలు మరియు విశేష పూజలు నిర్వహించి అయ్యప్ప స్వామి భజనలతో ఆనందబరితులను చేశారు. ఈ సందర్భంగా గురు స్వామి మాట్లాడుతూ కలియుగ ఆరాధ్య దైవం అయినటువంటి కారణజన్ముడు శ్రీ అయ్యప్ప స్వామి పూజ ఫలితం ఎంతో అద్భుతంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామిని సేవించి అనంతరం దర్శనార్థం శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధి చేరుకుని పావని బంగారు మెట్లని ఎక్కి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి పూజకు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు మరియు పంచామృత ప్రసాద వితరణ అనంతరం అల్పాహార అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.