logo

హెచ్ఐ.వి. ఎయిడ్స్ రెడ్ రిబ్బన్ కార్యక్రమం లో క్విజ్ పోటీలు,ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతి.

ఆళ్లగడ్డ:: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆదేశాల ప్రకరం నంద్యాల జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ విభాగం వారి మార్గదర్శకం లో, హెచ్ ఐ వి ఎయిడ్స్ పై జరిగిన రెడ్ రిబ్బన్ కార్యక్రమం లో భాగంగా సోమవారం నిర్వహించిన క్విజ్ పోటీలలో ప్రతిభకనపరచిన ఎద్దుల పాపమ్మ ఎద్దుల పెద్దమద్దిలేటిరెడ్డి స్మారక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినిలు మౌనిక,అఖిలాండేశ్వరి లకు రూ 3000 రూపాయలు నగదు తృతీయ బహుమతి గా అందచేయడం జరిగింది. ఈ నగదు బహుమతిని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వెంకటరమణ అందచేసి , పోటీలలో ప్రతిభకనబరిచిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్ ఐ వి ఎయిడ్స్ పై అవగాహన కల్పించడం చాలా అవసరమని అందులోనూ ముఖ్యంగా విద్యార్థులకు అవగాహన కల్పించడం తో పాటు వారిని భాగస్వామ్యులను చేయడం ద్వారా ఎయిడ్స్ నిర్మూలనకు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమం లో అదనపు నంద్యాల జిల్లా క్లస్టర్ ప్రోగ్రామ్ మెనేజర్ హైదర్ అలీ పాల్గొన్నారు, ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, జిల్లా ఎయిడ్స్ నింత్రణ మరియు నివారణ విభాగం వారికి కృతజ్ఞతలు తెలియచేశారు.

60
3625 views