logo

ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాలను సందర్శించిన ఏకలవ్య ఫౌండేషన్




25 మంది రైతులతో కూడిన ఏకలవ్య ఫౌండేషన్ గన్నేరు పుట్టు వాటర్ షెడ్ పథకంలో భాగంగా జిల్లా ఇన్చార్జ్ ఉమా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని 15 గ్రామాల రైతులు బయో రిసోర్స్ సెంటర్ పరిశీలనలో భాగంగా పాచిపెంట మండలంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను కూరగాయల నమూనాలను పరిశీలించారు ఈ సందర్భంగా అమ్మ వలస కేసలి గ్రామాలలో ఏర్పాటుచేసిన ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాలను పరిశీలించారు. పాడేరు మండలంలో కాఫీ తోటలో ఎక్కువగా ఉన్నాయని ఇటీవల కాలంలో ఆశించిన పురుగు నివారణ కోసం అగ్ని అస్త్రం , బ్రహ్మాస్త్రం పేడ, మూత్రం, ఇంగువ ద్రావణం, పంచగవ్య వంటి ద్రావకాల తయారీ వివరాలను తెలుసుకున్నారు అనంతరం ప్రధాన పంటలకు కావలసిన పెట్టుబడిని గట్లపై వ్యవసాయం ద్వారా పలు పంటల వ్యవసాయం ద్వారా ఎలా సంపాదించాలో తెలుసుకునే మాటలను పరిశీలించారు ఏటీఎం కూరగాయల నమూనాలను పెండాల ద్వారా కూరగాయల పెంపక విధానాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి కె.తిరుపతిరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకృతి సేద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని రానున్న రోజులలో రసాయన వ్యవసాయాన్ని తగ్గించి ప్రకృతి సేద్య విస్తీర్ణాన్ని పెంపొందించాలని బహుళ పంటలు అంతర పంటలు పంట మార్పిడి విధానాల ద్వారా భూమి వాతావరణం పర్యవేక్షింపబడి ఆరోగ్యవంతమైన పంటలు పండించడం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిలు శ్రీను విజయ్ పాల్గొన్నారు.

5
1266 views