logo

వ్యర్థాలతో బురదమయం అయిన రోడ్డు అవస్తలు పడుతున్న కాలనీవాసులు.

నంద్యాల జిల్లా రుద్రవరం మండల పరిధిలోని పోలీస్ స్టేషన్ నుంచి పెద్దమ్మ బయలు వీధికి వెళ్ళు రాస్తా రోడ్డు బురదమయమై వ్యర్థ దుర్వాసనలు వెదజల్లుతున్న పట్టించుకునే నాధుడే లేడని కాలనీవాసులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే అమ్మవారి శాల బజారు నుండి అధిక నీరు రోడ్లమీద పోస్తూ ఉండటంతో వ్యర్థాలతో కూడిన నీరు దుర్గంద వాసనలతో ఇక్కడ పారుతూ ఉంటుందని, కనీసం సైడ్ కాలువలు కూడా లేని పరిస్థితి కావడంతో రోడ్లపైనే ఈ నీరు నిలువ ఉండి బురదమయమై ఇండ్లలోకి వెళ్లడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని, మెయిన్ రోడ్డు కావడంతో వాహనాలు అధిక సంఖ్యలో తిరుగుతూ ఉండడం వల్ల బురద వెదజల్లి ఇండ్ల గోడలకి పడుతూ ఉందని ప్రభుత్వం గ్రామాలలోని కాలనీలు బాగుపడాలని ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న గ్రామస్థాయిలో మాత్రం బురదమైన రోడ్లతో కనువిందు చేస్తున్నాయని, అధికారులు ఉద్యోగులు రోడ్లపైన బురదలో వెళుతూ పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని కాలనీవాసులు వాపోతున్నారు.

18
1533 views