logo

చెకు ముకిలో మెరిసిన ఎక్సలెంట్ ఈ.ఎం. హై స్కూల్ విద్యార్థులు విద్యార్థుల విజయంపై హర్షం వ్యక్తం చేసిన ప్రిన్సిపాల్ భాను ఖాన్, కరెస్పాండెంట్ జే.ఎం ఖాన్.

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా **మణుగూరు టౌన్** నవంబర్ 22 **(ఏఐఎంఎం మీడియా ప్రతినిధి)


చెకు ముకిలో మెరిసిన ఎక్సలెంట్ ఈ.ఎం. హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు

*విద్యార్థుల విజయంపై హర్షం వ్యక్తం చేసిన ప్రిన్సిపాల్ భాను ఖాన్, కరెస్పాండెంట్ జే.ఎం ఖాన్.


జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయిలో నిర్వహించిన చెకుముకి టాలెంట్ టెస్ట్ పోటీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో బొంబాయి కాలనీలోని ఎక్సలెంట్ ఈ.ఎం హై స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరచి అందరి ప్రశంసలు అందుకున్నారు.పాఠశాలకు చెందిన విద్యార్థులు యశ్విత, సంహిత, లోహిత్ చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో పాల్గొని ప్రథమ స్థానాన్ని సాధించారు. విజేతలకు మణుగూరు ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జీ. నాగశ్రీ, డాక్టర్ బాలకృష్ణ చేతుల మీదుగా మొదటి బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ, ఇటువంటి పోటీలు విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో ప్రథమ బహుమతి సాధించడం ద్వారా విద్యార్థులు తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం గర్వపడేలా చేశారని అన్నారు.విద్యార్థుల విజయంపై ఎక్సలెంట్ ఈ.ఎం హై స్కూల్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. విజేతలకు చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వాహకులు, జనవిజ్ఞాన వేదిక తెలంగాణ మణుగూరు మండల కోఆర్డినేటర్ మీరా హుస్సేన్ అభినందనలు తెలియజేశారు.

16
748 views