logo

మైనర్ బాలికకు పెళ్ళి చేసినందుకు నిందితులు అరెస్ట్

మైనర్ బాలికకు పెళ్ళి చేసినందుకు నిందితులు అరెస్ట్

క్రౌన్ హ్యూమన్ రైట్స్ గుంటూరు నవంబర్ 22;

13 ఏళ్ల మైనర్ బాలిక వివాహ ఘటనలో వరుడు, అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేసిన గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయ.గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో బాలికలు , మహిళల రక్షణ , భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని గుంటూరు సౌత్ జోన్ డిఎస్పి భానోదయ మీడియాకు తెలిపారు.మైనర్ బాలిక వివాహానికి కారణమైన ఆమె నాయనమ్మ, వివాహం జరిపించిన చర్చి పాస్టర్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు..నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని తురకపాలెం గ్రామంలో ది.09.05.2025 తేదీన జరిగిన మైనర్ బాలిక వివాహ ఘటనకు సంబంధించి చైల్డ్ వెల్ఫేర్ ,ప్రొటెక్షన్ వారికి సమాచారం అందించిన బాధిత మైనర్ బాలిక.బాధిత మైనర్ బాలిక అందించిన సమాచారం ప్రకారం తురకపాలెం గ్రామ పంచాయతీ సెక్రటరీ నక్కా.నాగ బ్రహ్మం నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేపట్టి, మైనర్ వివాహ ఘటనకు కారణమైన నిందితులను గుర్తించి వివాహం చేసుకున్న వ్యక్తిని, అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేసినట్లు ఆమె తెలిపారు.
కొరివి దానియేలు (బాధిత బాలిక భర్త ),కొరివి శాంసన్ (నిందితుడు A-1 తండ్రి), కొరివి నిర్మల (నిందితురాలు A-1 తల్లి) అరెస్టు చేశామన్నారు.
బాధితురాలి నాన్న సుమారు ఐదు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించగా, అప్పటి నుండి బాధితురాలు, ఆమె తల్లి మరియు మిగిలిన తోబుట్టువులతో కలిసి పెదకాకానిలోని ఆమె అమ్మమ్మ ఇంటిదగ్గర ఉంటున్నది.ఈ క్రమంలో బాధితురాలు తండ్రి స్వగ్రామమైన వట్టిచెరుకూరు మండలం కోర్నెపాడు గ్రామంలో తన తండ్రి తరపున వాటాగా వచ్చే ఆస్తిని ఇవ్వడానికి బాధితురాలికి 13 సంవత్సరాలు వయస్సు అని తెలిసి కూడా 26 సంవత్సరాల వయస్సు కలిగిన ఆమె మేనత్త కొడుకుని వివాహం చేసుకోవాలని, ఆమె మేనత్త, మేనత్త భర్త తరచుగా పెదకాకానిలోని బాధితురాలు ఉండే నివాసానికి వెళ్లి పదేపదే అడుగుతూ ఒత్తిడి చేస్తున్నట్లు, వివాహనానంతరం కూడా బాలిక చదువును కొనసాగిస్తామని చెప్పి మేనత్త, ఆమె భర్త మరియు నానమ్మలు బాధితురాలి తల్లిపై కూడా ఒత్తిడి తీసుకురాగా, బాధితురాలి తల్లి వారి బాధను భరించలేక బాధితురాలిని మేనత్త కొడుకుకి ఇచ్చి వివాహం జరిపించుటకు అంగీకరించడం జరిగింది.ఈ క్రమంలో ది.09.05.2025 తేదీన తురకపాలెం గ్రామంలోని చర్చిలో బాధితురాలికి ఆమె మేనత్త కొడుకుతో ఆమె మేనత్త, మేనత్త భర్త మరియు బాధితురాలు తల్లి, బంధువుల సమక్షంలో చర్చి పాస్టర్ వివాహం జరిపించడం జరిగింది. వివాహానంతరం నిద్రలకు తిరుగుతూ ఉన్న సమయంలో మరియు కాపురానికి వెళ్లిన సమయంలో తురక పాలెం గ్రామంలోని బాధితురాలి మేనత్త ఇంటిలో బాధితురాలని ఆమె భర్త పలు మార్లు లైంగికంగా అనుభవించినట్లు, అదే విధంగా బాధితురాలైన మైనర్ బాలికను చదువుకోవడానికి బడికి పంపించకుండా, ఇంటి దగ్గరే ఉండమని వేధిస్తున్నట్లు, వారి బాధలు భరించలేక బాధితురాలు ఆమె అమ్మకు ఫోన్ చేసి చెప్పగా ఒక నెల క్రితం బాధితురాలి అమ్మ ఆమెను తన అమ్మమ్మ ఇంటికి తీసుకుని వెళ్ళగా, సుమారు వారం క్రితం బాధితురాలు మేనత్త మేనత్త భర్త ఇద్దరు బాధితురాలు ఇంటికి వెళ్లి ఆమెను కాపురానికి పంపించమని అడగగా అంతటా బాధితులు భయపడి చైల్డ్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 కి సంప్రదించి, ది.08.11.2025 తేదీన వారికి ఫోన్ ద్వారా జరిగిన విషయాలు చెప్పడం జరిగింది. ఈ క్రమంలో తురకపాలెం గ్రామ సచివాలయం నందు సెక్రటరీగా పనిచేస్తున్న నక్కా. రామ బ్రహ్మనాయుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో సభ్యుడిగా కూడా ఉండటం వలన తనకు చైల్డ్ హెల్ప్ లైన్ అధికారుల నుండి రాబడిన వాట్సాప్ మెసేజ్ ద్వారా బాధితురాలికి బాల్య వివాహం జరిగినట్లు తెలుసుకొని ఈ విషయం గురించి తన తోటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో అందరు సభ్యులతో కలసి, మైనర్ బాలికను ఆమె అమ్మను పిలిపించి విచారించి ఆ విచారణలో మైనర్ బాలిక వెల్లడించిన విషయాలను బట్టి తగు చర్య నిమిత్తం నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగినది.సదరు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, సౌత్ డిఎస్పి బానోదయ సమగ్ర విచారణ జరిపి ఈ మైనర్ బాలిక వివాహ ఘటనకు కారణమైన వరుడుని, బాధితురాలి మేనత్త, మేనత్త భర్తలను శుక్రవారం సాయంత్రం సుమారు 06:00 గంటల సమయంలో గుంటూరు రూరల్ మండలం పెదపలకలూరు గ్రామము జేఎల్ఈ సినిమా హాల్స్ దగ్గరలో అరెస్టు చేయడం జరిగింది.ఈ మైనర్ బాలిక వివాహానికి కారణమైన మైనర్ బాలిక నాయనమ్మను, వివాహం జరిపించిన చర్చి పాస్టర్ను, సంఘ పెద్దలను, హాజరైన బంధువులపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది డిఎస్పీ తెలిపారు.

0
0 views