logo

తుఫాను ముప్పు నేపథ్యంలో రైతన్నలు తక్షణమే అప్రమత్తం కావాలి శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య విజ్ఞప్తి.

తుఫాను ముప్పు నేపథ్యంలో
రైతన్నలు తక్షణమే అప్రమత్తం కావాలి

శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య విజ్ఞప్తి.

క్రౌన్ హ్యూమన్ రైట్స్
జగ్గయ్యపేట నవంబర్ 22;

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 'సెన్యార్' (Senyar) తుఫాను నేపథ్యంలో రైతాంగం అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తంగిరాల సౌమ్య కోరారు.
రాబోయే మూడు రోజుల్లో (నవంబర్ 26 నుండి) కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున, పంట నష్టాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.ముఖ్యంగా వరి రైతులు కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలని కోరారు.
దయచేసి రైతులు ఎవరూ రోడ్ల మీద ధాన్యాన్ని ఆరిపోయవద్దని. మొక్కజొన్న ,పత్తి, రైతులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రైతన్నలు ఎవరూ అధైర్యపడొద్దని. ప్రభుత్వ యంత్రాంగం సదా అప్రమత్తంగా ఉంటుందని. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు అందరూ అందుబాటులో ఉండి, రైతులకు సహకరించాలని అధికారులను ఆదేశించారు.
రైతులు ప్రభుత్వ అధికారుల సలహాలను, వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు అనుసరించాలని .ఏమైనా అత్యవసర సహాయం కావాలంటే, వెంటనే స్థానిక నాయకులను అధికారులను లేదా నేరుగా శాసనసభ్యురాలు కార్యాలయాన్ని సంప్రదించవలసిందగా కోరారు.

4
233 views