శ్రీ భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తికి భారత రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము శనివారం చేరుకున్నారు. పుట్టపర్తి లో అడుగు పెట్టిన వెంటనే భారత రాష్ట్రపతి శ్రీ సత్య సాయి బాబా సమాధిని భక్తిశ్రద్ధలతో సందర్శించారు. శ్రీ సత్య సాయి బోధనలు విశ్వశాంతికి మార్గదర్శకాలని బాబా సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పలువురు కేంద్ర మంత్రులు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు.విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు అధికారులు పాల్గొన్నారు.