logo

నందిగామలో పచ్చదనానికి పలుకరింపు టెర్రస్ గార్డెన్స్‌ పరిశీలించిన ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య

ఎన్టీఆర్ జిల్లా నందిగామ, నవంబర్ 22: (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

నందిగామ పట్టణంలో పచ్చదనాన్ని ప్రోత్సహించేం దుకు ఏర్పాటు చేసిన టెర్రస్ గార్డెన్స్‌ను శనివారం ప్రభుత్వం విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించారు. పట్టణం 15వ మరియు 16వ వార్డుల్లో ఏర్పాటు చేసిన ఈ తోటలను మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, అధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు ఎన్డీయే కూటమి నేతలతో కలిసి ఆమె పరిశీలించారు. ఇంటింటా ఏర్పడుతున్న టెర్రస్ గార్డెన్స్ పర్యావరణ పరిరక్షణకు, ప్రజల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇంటి పైకప్పులపై చిన్నతరహా తోటలు ఏర్పాటు చేసి ఆరోగ్యకరమైన కూరగాయ లను సాగుచేసుకోవడంతో పాటు పట్టణాల్లో వాతావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమాలకు ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద టెర్రస్ గార్డెన్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 15వ వార్డు కు చెందిన షేక్ షకీరా అవార్డు అందుకున్న సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
పచ్చదనం పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని వార్డుల్లో కూడా విస్తరించేలా చర్యలు తీసుకోవా లని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

0
68 views