logo

చిన్న పత్రికలపై ఏం ప్యానల్ ముసుగు, అక్రిడేషన్ పై కొత్త కుట్ర

*@-చిన్న పత్రికల పై ‘ఎంపానెల్’ ముసుగు…*

*@-అక్రిడేషన్‌పై కొత్త కుట్ర?**

*@-దగా పడ్డ జర్నలిస్టులు...*

*@- అడ్డగోలుగా అక్రిడేషన్ షరతులు... !?*

*@-ఎంపానెల్ శరణ్యమా....!!*

*@-రెగ్యులారిటీకి దిక్కే లేదా....!!*

* ఎంపానెల్‌మెంట్ నిజంగానే ‘అక్రిడేషన్‌కు అర్హత’ ప్రమాణమా?*

*@-ఎక్కడ, ఎప్పుడు లేని షరతులు ఇప్పుడే గుర్తుకు వచ్చాయా....!!*

*@-ప్రభుత్వాలు మారిన ప్రతిసారి జర్నలిస్టులకు ఎక్కడలేని షరతులు...!!*

* అక్రిడేషన్ ఎక్కువ ఇచ్చినా ప్రభుత్వానికి నష్టం ఏమిటి?*

*@-సమాజంలో 4 వ స్తంభంగా పిలవబడే మీడియాకు ఇచ్చే విలువ అదేనా....!!*

* "చిన్న పత్రికలను అణచే ప్రయత్నం ఆపాలి" –నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA)*

* సీఎం – డిప్యూటీ సీఎం – మంత్రి మండలి దృష్టికి తీసుకువెళ్లడానికి సిద్ధం అయిన - నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA)*

*– అమరావతి........

“జర్నలిస్ట్" ఒక వ్యక్తి వ్యక్తి కాదు… ఒక వ్యవస్థ.” అని చెప్పడానికి ప్రభుత్వాలు వెనకాడవు. కానీ అదే ప్రభుత్వాలు ఆ వ్యవస్థను నిలబెట్టే జర్నలిస్టులపైనే ఇప్పుడు విచ్చలవిడిగా నిర్ణయాలు. ప్రజాస్వామ్యానికి బీటల పడే ప్రమాదం. ఈ రాష్ట్రంలో అక్రిడేషన్ వ్యవస్థపై నడుస్తున్న గందరగోళాన్ని, చిన్న పత్రికల పై జరుగుతున్న “దౌర్జన్యాత్మక” విధాన మార్పులను, ఎంపానెల్‌మెంట్ పేరుతో జరుగుతున్న “దారుణాన్ని”ను "వార్తా ప్రపంచం" లోతుగా పరిశీలించింది. ఇది నిబంధన కాదు. ఇది వ్యూహం. ఇది తప్పు కాదు. ఇది ఉద్దేశం. ఇది పరిపాలన కాదు. ఇది నియంత్రణ.

600 స్థానిక చిన్న స్థాయిలో సర్క్కులేషన్ ఉండే పత్రికలకు ఎంపానెల్ లేదని బూచిగా చూపి అక్రిడేషన్ లకు మొండిచెయ్యి.. ఈ 600 స్మాల్ న్యూస్ పేపర్స్ లో పనిచేస్తున్న రిపోర్టర్లకు తీరని అన్యాయం....!! అసలే చాలి చాలని బ్రతుకులతో... ప్రింటింగ్ ఖర్చులకు కూడా నోచుకోక, బయట నుంచి యాడ్స్ రూపంలో ఆదాయం లేక అవస్థలు పడుతున్న చిన్న స్థాయి పత్రికలపై కనికరం చూపలేకపోతున్న ప్రభుత్వ సమాచార పౌరసంబంధాల శాఖ (ఐ అండ్ పి ఆర్)...!! కమిషనర్ లు మారుతున్నారు.... నిర్ణయాలు మారుతున్నాయి...మరి జర్నలిస్టుల జీవితాలను పట్టించుకునే వారు ఎవరు... రెగ్యులారిటీ ఉండి, సర్క్కులేషన్ ఉండి, ఈఫైలింగ్ ఆడిట్ రిపోర్ట్స్ సక్రమంగా ఉంటే గత ప్రభుత్వాలు గుర్తించి స్టేట్ హెడ్ క్వార్టర్ అక్రిడేషన్లు మంజూరు చేశారు.
స్టేట్ హెడ్ క్వార్టర్స్ లో ఇవ్వాల్సిన అక్రిడేషన్ లను సైతం జిల్లాలకు ముడిపెట్టి ఎంప్యానెల్మెంట్ లేకుంటే ఇవ్వము అనడం ఎంతవరకు సబబు అని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) ఆవేదన వ్యక్తం చేస్తుంది...!!

* అడ్డగోలుగా అక్రిడేషన్ షరతులు..?*

గతంలో ఏ ప్రభుత్వం పెట్టని ప్రమాణాలు… ఏ జీవోలో లేని కొత్త అడ్డంకులు… గత పదేళ్ళుగా అమలుకాలేని షరతులు… ఎక్కడా ప్రస్తావించని ఎంపానెల్ అవసరం. అన్నీ ఒక్కసారిగా ఇప్పుడే ‘తెలుసుకున్నట్టు’ ఐ&పీఆర్ శాఖ చర్యలు ఆశ్చర్యమే కాదు.. అనుమానాలకు తావిస్తుంది. “ఎంపానెల్ లేదు కాబట్టి అక్రిడేషన్ లేదు”. అన్న ఒక్క లైన్‌తో 600కి పైగా చిన్న పత్రికలను తొలగింపు జాబితాలో పెట్టేసినట్టే. చిన్న పత్రికలు ప్రభుత్వ ప్రకటనలు తీసుకోవు. ఎంపానెల్ చేయించుకోలేని ఆర్థిక స్థితి. అయినా… ఎంపానెల్ లేకుంటే అక్రిడేషన్ ఎందుకు అనేది సమాచార అధికారుల ఆలోచనగా ఉంది..?

* ఎంపానెల్‌మెంట్ నిజంగానే ‘అక్రిడేషన్‌కు అర్హత’ ప్రమాణమా?*

ఎంపానెల్‌మెంట్ అనేది అసలు ప్రకటనలు పొందడానికి రూపొందించిన పద్ధతి. అది ఒక ఆర్థిక వేదిక. అక్రిడేషన్ మాత్రం జర్నలిస్ట్‌కు ఒక గుర్తింపు—ఒక గౌరవం—ఒక భద్రత. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ ఈ రెండు వ్యవస్థలను కలిపి, అర్థంలేని అడ్డంకులను సృష్టిస్తోంది. ఎంపానెల్‌మెంట్ లేకపోతే అక్రిడేషన్ లేదు అంటున్నారు. కానీ ఎంపానెల్‌మెంట్ అవకాశమే లేని చిన్న పత్రికలు ఏం చేయాలి?ప్రకటనలు ఇచ్చేది సమాచార శాఖ కాబట్టి… ఎంపానెల్ చెయ్యకపోయేది కూడా సమాచార శాఖ కాబట్టి… మరి తప్పు ఎవరిది? చిన్న పత్రికలదా? ఈ పత్రికలు ప్రభుత్వానికి భారం కావు. పత్రికలకు ఎంపానెల్ ఇవ్వకపోవడం సమాచార శాఖ నిర్ణయం, కానీ దాని పరిణామాలన్నీ జర్నలిస్టులు భరించడం ఎంతవరకు న్యాయం?

* ఎక్కడ లేని షరతులు… ఎప్పుడు గుర్తొచ్చాయో ఎవరికీ అర్థం కాదు!*

చిన్న పత్రికలకు ఎంపానెల్ లేకపోతే అక్రిడేషన్ రాదట.దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఇది నిబంధనా? లేదు. ప్రభుత్వ ప్రకటనల కోసం ఉండే DAVP/CBC ఎంపానెల్‌మెంట్ని,
ఇప్పుడు అక్రిడేషన్ కి అడ్డంకిగా పెట్టడం, చిన్న పత్రికల మెడపై కత్తి పెట్టినట్టే. ఇందులో ప్రభుత్వం ఏమి కోల్పోతుంది?. ఎంపానెల్‌మెంట్ లేకున్నా చిన్న పత్రికలకు ప్రభుత్వ యాడ్స్ రాలేవు. అయితే అక్రిడేషన్ ఎందుకు ఆపాలి? ఇది శిక్షనా? లేక వివక్షా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రభుత్వ వ్యవస్థలో ఒక్క అధికారి ముందుకు రావడం లేదు.

*@-కొత్త వెబ్సైట్ – పాత సమస్యలకు కొత్త గందరగోళం*

సమాచార శాఖలో పూర్తి అయోమయం.. అధికారులకే తెలియని నియమాలు— జర్నలిస్టులు బలి పశువులును చేస్తున్నారు.. కొత్త పోర్టల్ క్రియేట్ చేసారు. కానీ అందులో స్టేట్ vs జిల్లా అప్లికేషన్ క్లారిటీ లేదు. పత్రిక యాజమాన్యం డీటెయిల్స్ కనిపించడం లేదు. డాక్యుమెంట్ అప్లోడ్ అవ్వట్లేదు. ఎన్ని రోజుల్లో వెరిఫికేషన్ అవుతుందో సమాచారం లేదు. స్మాల్, మీడియం పేపర్స్ ఎడిటర్లు రోజూ జిల్లా సమాచార శాఖ కార్యాలయం చుట్టూ, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది.. అధికారులు అనుమతులు ఇవ్వడానికి కాదు, కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే ఉన్నట్లే వ్యవస్థ తయారైంది.

* డీప్ ఇన్వెస్టిగేషన్: ఐ&పీఆర్‌లో శాసనమా? లేక వ్యక్తిగత అధికారుల రాజ్యమా?*

గత ప్రభుత్వంలో అక్రిడేషన్ సర్క్యులేషన్, రెగ్యులారిటీ, ఈ-ఫైలింగ్, ఆడిట్ స్టేట్‌మెంట్స్ ఆధారంగా ఇచ్చారు. అదే ఇప్పుడు..? సర్క్యులేషన్, రెగ్యులారిటీ ఉన్నా పనికిరాదు, ఈ ఫైలింగ్ ఉన్నా పనికిరాదు, రిజిస్ట్రేషన్ ఉన్నా పనికిరాదు, గతంలో వచ్చిన స్టేట్ హెడ్ క్వార్టర్ అక్రిడేషన్ ఉన్నా పనికిరాదు. ఎందుకంటే ఒక కొత్త పదం వచ్చింది.
“ఎంపానెల్”. కానీ ఇక్కడ నిజం ఏమిటంటే—ఎంపానెల్ అనేది పత్రికలకు ప్రకటనలు ఇవ్వడానికి ఉపయోగించే వ్యవస్థ. అది అక్రిడేషన్‌కు ఎక్కడా సంబంధం లేదు. గత చట్టాలు, జీవోలు, కేంద్ర మార్గదర్శకాలు— ఎక్కడా “ఎంపానెల్ లేకుంటే అక్రిడేషన్ లేదు” అనే మాట లేదు. అయితే ఐ&పీఆర్ శాఖ ఈ కొత్త చట్టాన్ని ఎక్కడ రాసుకుంది? ఎవరి ఆదేశం? ఏం కోసం? ఇది పబ్లిక్‌గా జవాబు ఇవ్వలేని ప్రశ్న.

* ప్రభుత్వాలు మారిన ప్రతిసారి జర్నలిస్టులకే ప్రపంచం మారిపోతుందా?*

ఒక ప్రభుత్వం వెళ్లి మరో ప్రభుత్వం వస్తే— చిన్న పత్రికలకు ఎదురయ్యే తొలి దెబ్బ అదే: "కొత్త షరతులు వచ్చే వరకూ అక్రిడేషన్‌లు ఆపండి". ఇది ఏళ్ల తరబడి పునరావృతమవుతోంది. జర్నలిస్టుల వృత్తికి ఇది అవమానమేగా? వార్తలు సేకరిస్తున్న వారిపట్ల గౌరవం కోల్పోయిన సూచననా?

* అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారా?*

సర్కార్ మంచిదే చేయాలని చెబుతోంది. కాని అధికారులే తప్పు రూల్స్‌తో నిర్ణయాలు తీసుకుంటున్నారా? జర్నలిస్టులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే — ఒక శాఖా కమిషనర్ వస్తే ఒక రూల్. మారితే మరో రూల్. అక్రిడేషన్ అంటే అధికారుల ఆట వస్తువు కాదు. ఇది వేల కుటుంబాల బతుకు.

* అసలు లక్ష్యం ఏమిటి?*

చిన్న పత్రికలను నెమ్మదిగా క్లోజ్ చేసి పెద్ద మీడియా చేతుల్లోకి రంగాన్ని నడిపించడమా?. ఏదైనా పాలసీ ఉంటే— అది క్లియర్‌గా, పారదర్శకంగా, రాతపూర్వకంగా చెప్పాలి కదా? ఇక్కడ అది లేదు.
ఇక్కడ ఉన్నది. అమాయక జర్నలిస్టులపై జరుగుతున్న అప్రకటన దౌర్జన్యం.

*ప్రభుత్వం స్పందించాలి — వెంటనే స్పందించాలి*

▪️ అక్రిడేషన్ ప్రక్రియ స్పష్టంగా ప్రకటించాలి
▪️ వెబ్సైట్ సమస్యలు వెంటనే సరిచేయాలి
▪️ ఎంపానెల్‌మెంట్ ను అక్రిడేషన్ షరతుగా తీసేయాలి
▪️ నియమాలు సమానంగా అమలు చేయాలి
▪️ జిల్లా & రాష్ట్ర సమాచార అధికారులకు సరైన అవగాహన ఇవ్వాలి
▪️ చిన్న పత్రికల్ని రక్షించే పాలసీ తీసుకురావాలి

* చిన్న పత్రికలు — పెద్ద పోరాటం*

ఈ 600 చిన్న పత్రికలు— బయటికి చిన్నగా కనిపించినా వార్తల ప్రపంచంలో లోతుగా పనిచేసే గొప్ప నిరాడంబర యోధులు. మరి వీటిలో పనిచేసే రిపోర్టర్లు? నెలకు 4,000–8,000 సంపాదన. బయట అడ్వర్టైజ్మెంట్ల ఆదాయం లేదు. ప్రింటింగ్, పంపిణీ ఖర్చులు ఆకాశానికి అందుకున్నాయి…రాత్రింబవళ్ళు ఫీల్డ్ వర్క్… ఎలాంటి భద్రత లేకుండా ప్రమాదాలను ఎదుర్కొనే పరిస్థితి… ఇలాంటి జర్నలిస్టులకైనా అక్రిడేషన్ అనేది ఒక గౌరవం, హోదా, వృత్తికి గుర్తింపు. ఇంతే.
దాంతో వారికి కోట్లు డబ్బులు రావు. భూములు రావు. బస్సు పాస్‌లు కూడా రావు. ఇన్సూరెన్స్ కూడా లేదు. అయితే… ఎందుకని ప్రభుత్వాలు అక్రిడేషన్‌ను ఇంత భయంకరమైన ఆయుధంగా మలుస్తున్నాయి?

* ఐ&పీఆర్ శాఖ – సమాచారం ఇవ్వాలి కానీ, సమాచారాన్ని దాచుతోందా?*

బ్యూరోక్రసీ చేతుల్లో గతం లేని నియమాలు, నిర్వచనం లేని షరతులు, వాస్తవం లేని ప్రమాణాలు తయారవుతున్నాయన్న. అనుమానం పెరుగుతోంది. అక్రిడేషన్‌లపై ఐ&పీఆర్ శాఖ తీసుకున్న నిర్ణయాలు
ప్రభుత్వం చెప్పిందా? లేక అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారా? NARA ఈ ప్రశ్నను సూటిగా అడుగుతుంది.

* అక్రిడేషన్ ఎక్కువ ఇచ్చినా ప్రభుత్వానికి నష్టం ఏమిటి?*

ఒక్కసారి ఆలోచిస్తే— జర్నలిస్టులకు ఐదు గజాల భూమి ఇవ్వలేదు. స్టేట్ బస్సు పాస్ లేదు, రైల్వే పాస్ లేదు, రిస్క్ ఇన్సూరెన్స్ లేదు, పెన్షన్ లేదు, సబ్సిడీ లేదు, ప్రభుత్వ ప్రకటనలు లేవు అయినా కూడా ఎందుకు అక్రిడేషన్‌ను ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు? అక్రిడేషన్‌ జర్నలిస్టులకు ఇవ్వగానే ప్రభుత్వానికి ఏ ఆర్థిక భారం లేదు. అయితే ఎందుకు ఇవి అన్నీ?జర్నలిస్టుల ఎదుగుదలను అడ్డుకోవడమా? లేక చిన్న పత్రికల మూతపడిపోయేలా దారితీసే వ్యూహమా?

*నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) ఆవేదన:*

"ఇది జర్నలిస్టులపై దాడి. సమాధానమివ్వాల్సింది ప్రభుత్వం!" అక్రిడేషన్ సమస్యను రాష్ట్రా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి భారీ ఉద్యమం సిద్ధం** నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) ఈ పరిస్థితిని తేలికగా తీసుకోలేదు.
చిన్న పత్రికలపై జరుగుతున్న అన్యాయాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించిన తర్వాత
NARA తీసుకున్న నిర్ణయాలు సూటిగా, స్పష్టంగా ఉన్నాయి.

* "చిన్న పత్రికలను అణచే ప్రయత్నం ఆపాలి" – *

1.“అక్రిడేషన్ ఎక్కువ ఇస్తే ప్రభుత్వానికి ఆర్థిక భారం లేదు.”

2.“అక్రిడేషన్ ద్వారా ఎవ్వరూ కోటీశ్వరులు కాలేదు.”

3.“అక్రిడేషన్ అనే హక్కును అడ్డుకుంటే అది వ్యక్తిపై కాదు— వృత్తిపైన దాడి.”

4.“ఎంపానెల్ అనేది ప్రకటనల కోసం. అక్రిడేషన్ కాదు.”

5.“ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి.”

6.“జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం ఓపెన్ చర్చకు రావాలి.”

* సీఎం – డిప్యూటీ సీఎం – మంత్రి మండలి దృష్టికి తీసుకువెళ్లడానికి సిద్ధం*

గత ప్రభుత్వం కంటే జర్నలిస్టులకు ఎక్కువ న్యాయం చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడేషన్ల విషయంలో మీనమేషాలు లెక్కిస్తుంది.. సమాచార శాఖ అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు.. జర్నలిస్టులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ సమాచార అధికారులు చేస్తున్న తప్పులు వల్ల కూటమి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు వస్తుంది.. అసలు అక్రిడేషన్లు ఎక్కువ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఏమైనా ఆర్థిక భారం పడుతుందా..? అక్రిడేషన్లు వచ్చిన ఏ జర్నలిస్టు ఈ పది సంవత్సరాల్లో కనీసం ఒక ఇంటి స్థలం కూడా రాలేదు, రిస్క్ ఇన్సూరెన్స్ కూడా లేదు, రాష్ట్ర స్థాయిలో బస్సు పాసులు కూడా లేవు, రైల్వే పాసులు లేవు, అక్రిడేషన్ల వల్ల ఏమీ జర్నలిస్టులు కోటీశ్వరులు కాలేదు.. అదొక ఆత్మగౌరంగా ప్రభుత్వాలే క్రియేట్ చేశారు. చిన్న పత్రికలకు అదొక గుర్తింపు హోదా మాత్రమే. చిన్న పత్రికలో రిపోర్టర్లు వర్క్ చేయాలంటే, న్యూస్ కవరేజ్ వెళ్లాలంటే కనీసం అక్రిడేషన్లు కావాలి చిన్న పత్రికలకు ప్రోత్సాహము ఏమీ ఇవ్వడం లేదు.. ఈ పత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వాల నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేదు..

ఇవన్నీ ప్రభుత్వానికి తెలిసే చేస్తుందా లేదా సమాచార శాఖ అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారా.. దీనిపై నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, సమాచార శాఖ మంత్రి పార్థసారథ దృష్టికి తీసుకువెళ్లి జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకూ పోరాటానికి సిద్ధమవుతుంది.. చిన్న పత్రిక ఎడిటర్లు జర్నలిస్టులు అందరూ ఒక తాటి మీదకు వచ్చి మనం ఈ సమస్యలపై పోరాడడానికి కలిసికట్టుగా ప్రయాణం చేద్దాం అని పిలుపు ఇచ్చింది..

NARA స్పష్టమైన ప్లాన్ సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఐ&పీఆర్ శాఖ మంత్రి పార్థసారధి అందరికీ పూర్తి నివేదిక సమర్పించబడనుంది. కేవలం పత్రాలు కాదు… రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పత్రికల ఆధారాలతో, పూసగుచ్చిన నిజాలతో, జర్నలిస్టుల వాస్తవ జీవిత పరిస్థితులతో పూర్తి దర్యాప్తు రిపోర్ట్ సమర్పిస్తారు.

* చిన్న పత్రికలు – ఎడిటర్లు – రిపోర్టర్లు*

ఇది మనం కలిసే గెలిచే పోరాటం. NARA ఇచ్చిన పిలుపు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది— “స్వరం ఉన్న చోటే ప్రజాస్వామ్యం ఉంటుంది. చిన్న పత్రికలను మూయిస్తే ప్రజాస్వామ్యం మూగబోతుంది. అందుకే మనం అందరం ఒక తాటి మీదకు రావాలి.” చిన్న పత్రికలు ఇది సరైన సమయం, కలవాలి, మాట్లాడాలి. ఆవేదనను ప్రభుత్వానికి వినిపించాలి. అక్రిడేషన్‌ను జర్నలిస్టుల హక్కు చేయాలి.

* చివరి మాట*

అక్రిడేషన్ అనేది “ప్రభుత్వం ఇచ్చే అనుగ్రహం” కాదు. అది మీడియా వ్యవస్థను గౌరవించే విధానం. అదే గౌరవాన్ని చిన్న పత్రికలకు, చిన్న రిపోర్టర్లకు ఇవ్వకపోతే. సమాజంలో 4వ స్తంభం బలహీనమవుతుంది. చిన్న పత్రికలు బతకాలి. జర్నలిస్టులు నిలబడాలి… అప్పుడు మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యం నిలుస్తుంది.

ప్రజాస్వామ్యం బలపడుతుంది అని మాట చాలా బాగుంటుంది. కాని జర్నలిస్టుల గొంతు మూగపోతున్నప్పుడు, దేశం కూడా మూగపోయినట్లే. ఈ ఉద్యమం ఒక వృత్తి కోసం కాదు. ఇది ఒక హక్కు కోసం. ఇది ఆత్మగౌరవం కోసం. ఇది ప్రజాస్వామ్యం కోసం. జర్నలిస్టుల గౌరవాన్ని కాపాడటం ఒక ప్రభుత్వ బాధ్యత కాదు— ఒక రాష్ట్ర గౌరవం.

1
156 views