
కడప జిల్లాలోని విశ్వవిద్యాలయాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన పియుసి చైర్మన్ కూన రవికుమార్
AIMA న్యూస్ : కడప కలెక్టరేట్‌లో యోగి వేమన యూనివర్సిటీ, ఇడుపులపాయ IIIT, Dr. YSR Architecture & Fine Arts University తో పాటు జిల్లాలో ఉన్న ఇతర విశ్వవిద్యాలయాల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ Public Undertakings Committee (PUC) ఆధ్వర్యంలో విస్తృత సమీక్షా సమావేశం పియుసి కమిటీ చైర్మన్ మరియు ఆమదాలవలస గౌరవ శాసనసభ్యులు కూన రవికుమార్ గారి అధ్యక్షతన జరిగింది.
✅సమీక్ష సమావేశం లో చర్చించిన ముఖ్యమైన అంశాలు:
1.విద్యార్థుల ప్రవేశాలు & విద్యార్హత ప్రమాణాలు
2• బోధనా సిబ్బంది నియామకాల్లో పారదర్శకత
3• మౌలిక సదుపాయాల అభివృద్ధి
4• సాంకేతిక పునర్‌వ్యవస్థీకరణ & డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
5• పరిశోధనా కార్యక్రమాల పురోగతి
6• నిధుల వినియోగం & నిర్వహణ విధానాలు
✅ఈ సందర్భంగా యోగి వేమన యూనివర్సిటీలో జరిగిన అక్రమ నియామకాలపై కమిటీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను చైర్మన్ కూన రవి కుమార్ గారు ఆదేశించారు.
✅ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని తెలియజేస్తూ ,కడప
జిల్లాలోని విశ్వవిద్యాలయాలు రాష్ట్ర విద్యా వ్యవస్థను బలోపేతం చేసే కీలక కేంద్రాలని భావిస్తూ, పారదర్శక వ్యవస్థ, నాణ్యమైన బోధన మరియు పరిశోధన ప్రోత్సాహకాలు పైన చర్యలు వేగవంతం చేయాలని కమిటీ సూచించింది.
✅ భవిష్యత్తులో కూడా విశ్వవిద్యాలయాల పనితీరును కఠినంగా పర్యవేక్షిస్తూ, అవసరమైన మార్పులు తీసుకురావడానికి కమిటీ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా చైర్మన్ గారు తెలియజేశారు.
✅ ఈ కార్యక్రమంలో పియుసి కమిటీ సభ్యులైన గౌరవ ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్ గారు ,ఆనందరావు గారు, బేబీ నయన గారు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు యూనివర్సిటీల అధికారులు పాల్గొన్నారు.