logo

కొవ్వూరులో పచ్చదనం పరిశుభ్రత శిక్షణా కార్యక్రమం

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామంలో ఎంపీడీవో నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చెత్త నుండి సంపద సృష్టి భవనం వద్ద నిర్వహించిన థీమ్ 5 పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం పై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో 24 పంచాయతీల నుంచి 60 మంది క్లాప్ సిబ్బంది పాల్గొన్నారు. ఎంపీడీవో నాగేశ్వరరావు మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం, పర్యావరణ పరిరక్షణ, చెట్లు పెంపకం, ప్లాస్టిక్ నివారణ, మరియు పచ్చదనంతో కూడిన వాతావరణమే లక్ష్యంగా చేసుకోవాలన్నారు. అలాగే క్లాప్ సిబ్బంది గ్రామాల్లో పరిసరాలను శుభ్రంగా ఉంచే విధానం, చిట్లి యొక్క ప్రాముఖ్యత, వ్యర్థాలను సక్రమంగా పారవేయుట వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ పొందారు. అలాగే సర్పంచ్ వైకాంతము మాట్లాడుతూ గ్రామస్థాయిలోని ప్రజల్లోని అవగాహన, సహకారం మరియు స్వచ్ఛతపై సందేశాన్ని వ్యాప్తి చేయడంలో దోదపడుతుందన్నారు. గ్రామంలో కార్యక్రమం యొక్క ఆవశ్యకత ,అవసరాలను వివరిస్తూ ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు డిప్యూటీ ఎంపీడీవో, సచివాలయం సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, విహెచ్సి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్, పి ఆర్ పి పై లక్ష్మి, గ్రామంలోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ప్రజలు పాల్గొన్నారు



9
1155 views