పంట మార్పిడితో అధిక లాభాలు:మండల వ్యవసాయ అధికారి స్వప్నిక రెడ్డి.
గోస్పాడు (AIMA MEDIA): గోస్పాడు గ్రామంలో స్థానిక రైతు విజయానంద రెడ్డి 15 ఎకరాలలో సాగుచేసిన జనుము పంటను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి స్వప్నిక రెడ్డి. ఏవో మాట్లాడుతూ మండలంలో రైతులు సాంప్రదాయ పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. ఎకరాకు 8 నుండి 10 క్వింటాలు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. రైతులు తప్పనిసరిగా పంట మార్పిడి చేసుకోవాలని ధాన్యాల బదులు మినుము, పెసర ,ఆవాలు ఇతర ప్రత్యామ్యామ పంటలు , మరియు తక్కువ నీటితో పంటలు సాగు చేసి నేల సారవంతం పెంచుకోవాలని రైతులకు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ఏ.ఈ.ఓ రామకృష్ణ ,అగ్రికల్చర్ అసిస్టెంట్ శ్రీధర్ పాల్గొన్నారు.