logo

జిల్లాలో మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు: జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.

నంద్యాల (AIMA MEDIA): జిల్లాలోని మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేకతలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు.శుక్రవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్ నందు జిల్లా మత్స్యశాఖ వారి ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యశాఖ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ.... జిల్లాలో ఉన్న మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందన్నారు.నంద్యాల వ్యవసాయ అనుబంద శాఖలపైన ఆధారపడిన జిల్లా మన జిల్లాలో ఎక్కువగా హార్టికల్చర్, లైవ్ స్టాకు, అగ్రికల్చర్ తర్వాత ఆక్వారంగం ద్వారా జిల్లాకు జిడిపి ఎక్కువగా వస్తుందన్నారు. జిల్లాలో 65వేల మెట్రిక్ టన్నులు చాపల ఉత్పత్తి ఉందన్నారు. ఈ ఏడాది 80 వేల మెట్రిక్ టన్నులకు పెంచాలన్న ఆలోచనతో జిల్లా యంత్రాంగం ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. జిల్లాలో 330 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయని కానీ 110 ట్యాంకులలోనే చేపల పెంపకం జరుగుతోందని చేపల పెంపకం రిజర్వాయర్లు చెరువుల ద్వారా పెంచితే మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి పెరిగి జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ దిశగా చెరువులలో మరింత చేపల పెంపకం చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఉన్న ఫిష్ నర్సరీస్ ని అభివృద్ధి చేయడం జరిగిందని వచ్చే సంవత్సరానికి మరింత అభివృద్ధి చేసి జిల్లాకు కావలసిన చేపపిల్ల ఉత్పత్తిని మన జిల్లాలోనే జరిగి మత్స్యకారులందరికీ అందించడం జరుగుతుందన్నారు. మత్స్యకారులు సొసైటీలో సభ్యత్వం కావాలంటే ఐదు స్కిల్స్ ఉండాలని ఈ ఐదు స్కిల్స్ కు సంబంధించిన శిక్షణ కూడా ఫిసిరిస్ డిపార్ట్మెంట్ ద్వారా అందించి ఎక్కువ మందికి జీవనోపాధి కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపడం జరుగుతుందన్నారు. ఈ విధంగా జిల్లా యంత్రాంగం తరఫునుంచి అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ప్రతి కుటుంబంలో కనీసం ఒకరైన విద్యావంతులు ఉండాలని ప్రతి కుటుంబం ఉన్నత జీవన ప్రమాణాలతో గడపాలనుకుంటే మన కులవృత్తినే మన సంప్రదాయ వృత్తి అనుకొని ఎప్పటికీ మర్చిపోకూడదన్నారు. మన కులవృత్తులను పాటిస్తూనే మన పిల్లలను చదువు వైపు ప్రేరేపించాలన్నారు. ప్రతి కుటుంబంలో ఒకరైనా చదువుకున్న వ్యక్తి ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెంది ఆ కుటుంబం యొక్క రూపురేఖలు మారుతాయన్నారు. మత్స్యకారుల కోరిక మేరకు జిల్లాలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కోస్టల్ వారికి ఇచ్చిన బెనిఫిట్స్ అన్ని కూడా మన జిల్లాలో ఇచ్చేందుకు ఇక్కడి పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 50 సంవత్సరాలు పూర్తయిన మత్స్యకారులకు పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వ నియమ నిబంధనలు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. చేపల్లో ఉన్నటువంటి ఆరోగ్యకరమైన ప్రోటీన్లు ఎక్కడ దొరకవన్నారు. మనుషుల్లో తెలివితేటలు, పిల్లల మెదడు చురుకుగా పనిచేయాలంటే, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ చేపలు తినాలన్నారు.

2
590 views