logo

గౌరవరంలో సోలార్ ప్యానెల్స్ ప్రారంభం ఎంఎల్ఏ శ్రీరాం రాజగోపాల్, కేడీసీసీ చైర్మన్ రఘురామ్ చేతులమీదుగా

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నవంబర్ 21 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద గృహాలపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్‌ను మంగళవారం జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ ప్రారంభించారు. రిబ్బన్ కటింగ్ చేసి ప్యానెల్స్‌ను కార్యక్షమంగా మార్చారు.
కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆర్థిక సహకారంతో, ట్రూజోన్ సోలార్ / సన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల ద్వారా కరణం శ్రీనివాసరావు, కట్ట గోపీ గృహాలపై ఈ సోలార్ ప్యానెల్స్‌ ను ఏర్పాటు చేశారు. KBC ఎంటర్‌ప్రైజెస్ ప్రొప్రైటర్ కట్టా బుచ్చిబాబు ఆధ్వర్యంలో పనులు పూర్తయ్యాయి.
ఈ కార్యక్రమంలో పోచంపల్లి సొసైటీ చైర్మన్ ముల్లంగి రామకృష్ణారెడ్డి, గౌరవరం సొసైటీ చైర్మన్ కట్టా వెంకట నరసింహా రావు, సర్పంచ్ ముత్తవరపు పావని వెంకటేష్, సాధినీడి శేషగిరి, బండిపాలెం సొసైటీ చైర్మన్ బొల్లినీడి అప్పారావు, మల్కాపురం సొసైటీ చైర్మన్ ఘనపనేని పిచ్చయ్యతో పాటు గ్రామ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

1
134 views