
పచ్చ ధనం – పరిశుభ్రత కార్యక్రమం విజయవంతం
పల్లె పరిశుభ్రత–హరితహారం లక్ష్యంగా గుర్లతమ్మిరాజుపేట పంచాయతీలో “పచ్చ ధనం – పరిశుభ్రత” కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇన్‌చార్జ్ పంచాయతీ కార్యదర్శి జి. కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు విస్తృతంగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎం.పి.డి.ఓ సుదర్శన్ మాట్లాడుతూ —
*పరిశుభ్రతతో ఆరోగ్యం వస్తుంది. హరితహారంతో పర్యావరణం కాపాడుతుంది. గ్రామం పరిశుభ్రంగా ఉంటే అభివృద్ధి తథ్యం.అని పేర్కొన్నారు.
కార్యక్రమం సందర్భంగా గ్రామంలో చెత్త విభజన, చెట్ల నాటడం, నీటిమురుగులు నియంత్రణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, శానిటేషన్‌పై అవగాహన వంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి ఇంటిలో చెత్త వేరు చేయడం, వ్యర్థాలను సంపదగా మార్చుకోవడం గురించి ప్రజలకు సూచనలు అందించారు.
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తన వంతు బాధ్యత తీసుకోవాలని, శుభ్రత మరియు హరితహారం కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో సమగ్ర పరిశుభ్రత కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, గుర్లతమ్మిరాజుపేటను పూర్తి స్థాయిలో పచ్చదనం – పరిశుభ్రత మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దడం లక్ష్యమని పంచాయతీ సర్పంచ్ చొక్కాకు పైడిరాజు తెలిపారు.
కార్యక్రమంలో
డిప్యూటీ ఎం.పి.డి.ఓ విమల కుమారి,
మాజీ వైస్ సర్పంచ్ చొక్కాకు సన్యాసి నాయుడు
తో పాటు పంచాయతీ కార్యదర్శులు సచివాలయం సిబ్బంది వార్డు సభ్యులు అంగన్వాడీ టీచర్లు, , యస్ . హెచ్.జిమహిళలు, వి.ఓ సభ్యులు, ఆశ వర్కర్లు, క్లాప్ మిత్రులు, గ్రీన్ అంబాసిడర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.