రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం
జర్నలిస్ట్ : మాకోటి మహేష్
రోడ్డు ప్రమాదంలో ఓ బీటెక్ విద్యార్థి మృతి చెందిన ఘటన శంషాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలానికి చెందిన సిద్ధార్థ్ (22) నర్కూడలో ఉంటూ వర్ధమాన ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చదువుతున్నాడు. మంగళవారం సిద్ధార్థ బైకుపై నర్కుడ నుంచి కాలేజ్ వైపు వెళుతుండగా మార్గమధ్యలో ఆటో ట్రాలీ అతడి బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సిద్ధార్థ చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.