logo

ఏపీని మావోలు లేని రాష్ట్రంగా మారుస్తాం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.

ఏపీని మావోలు లేని రాష్ట్రంగా మారుస్తాం

డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.

క్రౌన్ హ్యూమన్ రైట్స్
అమరావతి నవంబర్ 20;

2026 మార్చి నాటికి రాష్ట్రంలో మావోయిజాన్ని అంతం చేస్తామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా అన్నారు. రంపచోడవరంలోని AOB ప్రాంతంలో ఆయన ఏరియల్ సర్వే చేశారు. మారేడుమిల్లి ఎన్ కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు చనిపోయారని తెలిపారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించారు. 50 మంది మావోలను అరెస్ట్ చేశామన్నారు. APని మావోలు లేని రా రాష్ట్రంగా మారుస్తామని, ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

0
0 views