
పోలి స్వర్గం కథ....
పోలిస్వర్గం కథ
#శ్రీ ధర్మకార్యాసక్తితో మోక్షప్రాప్తి*
కార్తికమాసాంతంలో అందరికి గుర్తుకువచ్చే కథ
'పోలి స్వర్గం'. తపన ఉంటే ఎంతటి అవాంతరాలు ఎదురైన, ఎన్ని హింసలకు గురైన, సహనంతో తాను చేయవలసిన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ, ధర్మాన్ని పాటించిన, భగవంతుడు వెన్నంటే ఉండి సహకరిస్తాడు అని, భగవంతుని కొలవడానికి కావ ల్సిందే శ్రద్దే కానీ ఆడంబరం కాదని పెద్దలు ఈ కథను ఉదాంతంగా చెపుతారు.
అత్త ఆహం, ఈర్వా, అసూయలతో ఉండటం వల్ల స్వర్గ ప్రాప్తిని చేజిక్కుంచుకోలేక పోయింది. అందరికన్నా చిన్నకోడలైన పోలికి ఆ అదృష్టం దక్కింది. ఇంతకీ ఎవరీ పోలి? కార్తికమాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆమె వెనుక ఉన్న కథ తల్చుకుంటూ ఈ ఆచారం ఎందుకు చేయాలి?..
ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుం బంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట. వారందరిలోకి చిన్నకోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా, వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం, ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె ఆహంభావం. అందుకే కార్తికమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీస్నానం చేసి దీపాలను వెలి గించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయల్దేరే వారు అత్త.
అప్పుడామె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను, యింటి పనులను చేస్తూ తన మనసులో 'దీనరక్షణ! గోవిందా! జనా ర్ధనా! స్వామీ! దీనబంధూ! నేనేమి చేయగలను. పవిత్రనదీ స్నానం లేదు. స్పూర్తినిచ్చు దీపారాధన లేదు. మనసునకు ప్రశాంతతనిచ్చు దైవదర్శనం, పూజ, పురాణ శ్రవణం ఏవి లేవు. నా కెటువంటి గతి కలుగునో కదా! నేనెంత దురదృష్టవంతురా లను' అని ఆమె బహు విధాలుగ విచారించెను.
కార్తికమాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్త గారు చేసే ప్రయత్నాలు సాగనేలేదు.
తన మనసులో భగవంతుని ధ్యానిస్తూ ఆమె, తన పరిస్థితికి లోబడి, యింటిలో కుండలోనున్న నీటితో స్నానమాచరించి, చినిగిన వస్త్రాన్ని ధరించిన ఆమె, తాను ధరించిన జీర్ణవస్త్రం అంచును చించి వత్తిగ చేసి, దానికొక పాత్రలో నుంచి కవ్వానికి ఉన్న కొద్దిపాటి వెన్నను తీసి, ఆ పాత్రలో ఉంచి, దీపాన్ని వెలి గించి, "స్వామీ! పుండరీకాక్షా! గోవిందా! జనార్ధనా! అనాధరక్షకా! దీనబంధూ! దయ జూపుము. నేనశక్తురాలను, నాపై అనుగ్రహం ఉంచుమని పోలి ప్రార్ధించింది.
కార్తికమాసం చివరిరోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తికదీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటిపనులన్నీ అప్పగించి మరీ వెళ్లింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటిపనులను చకచకా ముగించేసుకుని కార్తిక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమయినా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చటవేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె కోడళ్లూ... ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసి పోయారు.
కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనకునే ఆత్రంలో పోలి కాళ్లని పట్టు కుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమా నంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు.
అత్త మున్నగువారు సంసారం లోని మాయకు గుర్తులు కాగా, పోలి నిర్మల, నిశ్చల భక్తికి ప్రతీక. ఈ నేపథ్యంలో తెలుగింట స్త్రీలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే ఆర టిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరు వులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు. కాబట్టి.. టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది.
ఇలా వదిలిన అరటిదీపా లను చూసుకుంటూ పోలిని తల్చుకుంటారు. కార్తికమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా. ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే.. మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రహ్మ ణులకు దీపాన్ని కానీ, స్వయంపాకాన్ని కానీ దానం చేస్తుంటారు.
తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహా లక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలిదీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు.ఆదిత్యయోగీ.
నిషిద్ధములు: పగటి ఆహారం, ఉసిరి
దానాలు: నువ్వులు, తర్పణాలు, ఉసిరి
పూజించాల్సిన దైవం: సర్వదేవతలు + పితృ దేవతలు
జపించాల్సిన మంత్రం: ఓం అమృతాయ స్వాహా
మమసమస్త పితృదేవతాభ్యో నమః
ఫలితం: ఆత్మస్థయిర్యం, కుటుంబక్షేమం..*
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ
ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః