logo

జగ్గయ్యపేట 29వ వార్డులో రోడ్డు పనులపై ఎమ్మెల్యే తాతయ్య సమీక్ష

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, నవంబర్ 20: (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

జగ్గయ్యపేట పట్టణంలోని 29వ వార్డులో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర తో కలిసి గురువారం పరిశీలించారు. రోడ్డు పనుల నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని, ప్రమాణాల ప్రకారమే పనులు చేయాలని అధికారులు కు ఎమ్మెల్యే ఆదేశించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన—డ్రైనేజీ లోపాలు, తాగునీటి సరఫరా అంతరాయం, వీధి దీపాల లేమి, ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోవ డం తదితర అంశాలు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బం దులని గుర్తించారు. ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేసి శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అన్ని సమస్యలపై యుద్ధ ప్రాతి పదికన చర్యలు తీసుకుని, శాశ్వత పరిష్కారాలను అందిం చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ఎమ్మెల్యే వెల్లడిం చారు. వార్డులోని పలు డ్రైన్లు, చెత్త నిల్వ ప్రాంతాలను కూడా ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమం లో 29వ వార్డు కౌన్సిలర్ కంచేటి గీతా రాణి, ఎర్రి నరసింహారావు, కొల్లి మార్షల్ స్టాలిన్, కరణం నరసింహారావు, మల్లెల కొండయ్య, పునుగుపాటి పుల్లారావు, కొత్తపల్లి కోటేశ్వరరావు, నెల్లూరి శ్రీనివాసరావు, నెల్లూరి వెంకటేశ్వరరావు, యడ్లపల్లి రాంబాబు, పితాని శ్రీనాథ్, బండి నరసింహారావు, కాసరగడ్డ నరేష్, కాటగాని నరసింహారావు, గాలం శ్రీను, గింజుపల్లి రాము, గుంజ లక్ష్మణ్ మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

14
346 views