
మునగచర్లలో సత్యసాయి శతజయంతి సేవా శిభిరం
ఉచిత పశువైద్య సేవలకు భారీ స్పందన
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నవంబర్ 20 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)
మునగచర్ల భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి శతమానోత్సవాల సందర్భంగా నందిగామ మండలం మునగచర్ల గ్రామంలో గురువారం ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. సత్యసాయి సేవా స్పూర్తితో సేవా కమిటీ నందిగామ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్వయంగా సందర్శించి సేవల అమలును పరిశీలించారు. పశుపోషక కుటుంబాల ఆర్థికాభి వృద్ధికి పశుసంపద ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, గ్రామ ప్రజలతో ఎమ్మెల్యే మాట్లాడారు. “సత్యసాయి బాబా సేవాతత్వం సమాజన్నీ ఉత్తేజ పరచుట కు మార్గదర్శకం. ఆయన శత జయంతి సందర్భాన్ని పురస్క రించుకుని జరుగుతున్న ఈ శిబిరం నిజమైన సేవా కార్యక్రమం,” అని తెలిపారు.
చిన్న–పెద్ద పశువులకు ఉచిత వైద్య పరీక్షలు, టీకాలు, పోషకాహార సూచనలు, పశుసం రక్షణపై అవగాహన కార్యక్ర మాలు నిర్వహించగా, వైద్య సిబ్బందిని ఎమ్మేల్యే సౌమ్య శాలువాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సేవా కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ పంగులూరి నరసింహారావు, నందిగామ మార్కెట్ యార్డు చైర్మన్ పిట్టల శ్రీదేవి, వైస్ చైర్మన్ అమ్మినేని జ్వాలాప్రసాద్, కూటమి నేతలు, పశువైద్య అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మునగచర్ల గ్రామంలో జరిగిన ఈ సేవా శిబిరం సత్యసాయి బాబా సేవామార్గాన్ని స్మరింపజేస్తూ, గ్రామీణులకు ఉపయోగకరంగా నిలిచింది.