logo

గ్రంథాలయాలు జ్ఞాన చైతన్య కేంద్రాలు కావాలి: విప్ తంగిరాల సౌమ్య నందిగామలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నవంబర్ 20 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

నందిగామ టౌన్ నందిగామ స్థానిక గ్రంథాలయం ప్రాంగణం లో గురువారం నిర్వహించిన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ “పుస్తకాలు మనసుకు దివిటిలు. గ్రామాలు, పట్టణాలన్నింటిలో గ్రంథాలయాలు జ్ఞాన చైతన్య కేంద్రాలుగా నిలవాలి” అని పేర్కొన్నారు. గ్రంథాలయ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందనీ, నందిగామ గ్రంథాలయాన్ని మరింత మెరుగుపరిచే చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. చిన్నారుల్లో పుస్తక పఠనాభిరుచిని పెంపొందించేం దుకు గ్రంథాలయ శాఖ నిర్వ హించిన వివిధ పోటీల్లోవిజయం సాధించిన విద్యార్థులకు ఆమె స్వయంగా బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్‌ అందజేశారు.
గ్రంథాలయ వారోత్సవాలు యువతలో జ్ఞానాభివృద్ధికి దోహదపడతాయని ఎమ్మెల్యే అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో పుస్తక సంస్కృతిని ప్రోత్సహించేలా అధికారులు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ బండారు హనుమంతరావు, మాజీ గ్రంథాలయ డైరెక్టర్ రాటకొండ కోటేశ్వరరావు, కూటమి నేతలు, గ్రంథాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మొత్తంగా, నందిగామలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జ్ఞానోత్సవ వాతావరణాన్ని నెలకొల్పాయి.

0
0 views