logo

తెలంగాణ రాష్ట్ర 72వ అఖిల భారత సహకార వారోత్సవాల్లో ముఖ్య అతిథులుగా ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజు గారు


తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది జరిగేటువంటి అఖిలభారత సహకార 72వ వారోత్సవాలు హైదరాబాద్ లోని నిజాం కాలేజ్ ప్రక్కన గల సహకార సంఘ భవనంలో ఉత్తమ సహకార సంఘా అవార్డులను జాయింట్ రిజిస్టర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ సహకార యూనియన్ లిమిటెడ్ కెవిఎస్ అన్నపూర్ణ గారు ఇచ్చారు ఈ వారోత్సవాలు 14-11-2025 నుండి 20-11-2025 వరకు కొనసాగాయి మన జిల్లా నుండి ముగ్గురు పాక్స్ చైర్మన్ లకు అవార్డులను ఇచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు గారు పాల్గొన్నారు మాట్లాడుతూ ప్రతి ఏడాది జరిగే ఈ వారోత్సవాల్లో మరి కామారెడ్డి జిల్లా నుండి బాన్సువాడ సొసైటీ చైర్మన్ ఎరవల కృష్ణారెడ్డి గారికి మరియు చిల్లర్గి సొసైటీ ఒంటరి శపథం రెడ్డి గారికి, అడ్లూరు ఎల్లారెడ్డి సొసైటీ మర్రి సదాశివ రెడ్డి గారికి మరియు రాష్ట్రంలో మిగతా చైర్మన్ లకు వారు శుభాకాంక్షలు తెలియజేసినారు ఉత్తమఅవార్డు రావడం గర్వకారణంగా ఉందని వారు కొనియాడారు చైర్మన్లు సహకార సంఘల అభివృద్ధికి పాటుపడాలని సొసైటీ చైర్మన్లుగా యువత ముందుకు రావాలని అన్నారు అనంతరం వేదికపై వారికి శాలువాతో సన్మానించి అవార్డులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి బాన్సువాడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కత్తెర గంగాధర్ గారు, బాన్సువాడ మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్ గారు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ కలేక్ గారు, మాజీ ఎంపీపీ ఎజాస్ గారు, మాజీ జెడ్పిటిసి గోపాల్ రెడ్డి గారు,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ నార్ల రవీందర్ గారు, బాన్సువాడ మాజీ సొసైటీ డైరెక్టర్ పోతు రెడ్డి గారు,తడ్కోల్ మాజీ ఉపసర్పంచ్ వెంకట్ రెడ్డి గారు, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్ మన్సూర్ గారు, యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు అందే రమేష్ గారు, కట్కే రమేష్ గారు, తదితరులు పాల్గొన్నారు

0
640 views