logo

శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిరమాసోత్సవములు 2025

విశాఖపట్నం (బురుజుపేట )

శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో అన్న ప్రసాద భవనమునందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం.ఉపకమీషనరు & కార్యనిర్వాహణాధికారిణి కె.శోభారాణి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాస మహోత్సవం కరపత్రం ప్రారంభించడం జరిగింది. తదనంతరం కే శోభారాణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తేది.21-11-2025 నుండి తేది. 19-12-2025 వరకు జరుగు మార్గశిరమానోత్సవముల సందర్భముగా మొదటి లక్ష్మివారం అనగా 27/11/25, రెండవ లక్ష్యం 4/12/25, మూడవ లక్ష వారం 11/12/25, నాలుగవ లక్ష వారం18/12/25 ఉద||12 గం|| నుండి ఉద|| 11:30 గం|| వరకు మరల12 గం|| నుండి సా||5:30 7 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తాను. విరామ సమయంలో రాజభోగం, పంచామృత అభిషేకం, పంచ హారతులు, జరుగుతాయి. లక్ష్మివారం రోజు తప్ప మిగిలిన అన్ని రోజులలోనూ ఉ|| 6 గం కు ఉ|| 8 గం|| వరకు మరల ఉ|| 9 గం|| నుంచి సా|| 5:30 వరకు మరల రాత్రి 7 గం|| నుంచి రాత్రి 11 గం|| వరకు భక్తులు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు.
భక్తుల సౌకర్యార్ధం మార్గశిరమాసం తేదీ 21-11-2025 నుండి తేది.19-12-2025 వరకు అష్టదళ పద్మారాదన,సహస్ర తులసి పూజ, అయుష్ హోమం,లక్ష కుంకుమార్చన మరియు కుంకుమ పూజలు నిలుపుదల చేయడమైనది.
మార్గశిరమాసం ఆన్ లైన్ మరియు WhatsApp governance బుకింగ్.శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు 21-11-2025 నుండి తేదీ19-12-2025 వరకు నిర్వహించబోవు మార్గశిరమాసోత్సవములు సందర్భంగా మార్గశిరమాసోత్సవము సేవలు అనగా మార్గశిర పంచామృతాభిషేకం లక్ష్మీవారం రూ.10,000/-, మార్గశిర లక్ష్మీవారం మినహా మిగతా రోజులలో పంచామృతాభిషేకం రూ.3,000/-, మార్గశిర లక్ష్మీవారం మినహా మిగతా రోజులలో క్షీరాభిషేకం రూ.1,116/- మరియు మార్గశిర విశిష్ట దర్శనము టిక్కెటు రూ.500/- ముందుగా ఆన్ లైన్ వెబ్ సైట్ www.aptemples.org 2 మరియుWhatsApp governance 9552300009 చేసుకొనవచ్చునని తెలియ జేయడమైనది. కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో హుండీ నెం.6 పాడయిన కారణంగా తొలగించవలసివచ్చిన పరిస్థితి దృష్ట్యా నేడు హుండీ నెం.6 తెరిచి లెక్కించుట జరిగినది. అందున నగదు 37,269/- వచ్చినది.
మార్గశిరమాసం ఉత్సవముల సందర్భంగా విశాఖ నగర పోలీస్ కమీషనరు శంఖ భ్రత బాగ్చి,IPS వారు శ్రీ అమ్మవారి దేవాలయ పరిసర ప్రాంతము అంతయు పరిశీలించి సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీ అమ్మవారి దర్శనము జరిగే విధంగా ఏర్పాటు చేయుటకుగాను తగు సూచనలు జారీ చేసినారు. ఈ కార్యక్రమంలో కె.గాయత్రీ, కార్యనిర్వహణాధికారి,శ్రీ కరక చెట్టు పోలమాంబ ఆలయం,విశాఖపట్నం మరియు ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికార్లు ఎస్.ఆనంద్ కుమార్,కె.రాజేంద్ర కుమార్, మరియుఎ.అప్పల రాజు,మేనేజర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్,సాయి యన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,మెయిన్ బ్రాంచ్, విశాఖపట్నం, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు శ్రీ హరి సేవ,గోపాలపట్నం సభ్యులు మరియు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

29
634 views