logo

రావులపాలెం రూరల్ సీఐ హెచ్చరిక —పవిత్ర ఆలయంలో దొంగతనానికి తావులేదు

జర్నలిస్టు: మాకోటి మహేష్

ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీ లెక్కింపు సమయంలో దొంగతనానికి యత్నించిన వ్యక్తిని అక్కడికక్కడే పట్టుకున్నారు.

రామచంద్రాపురం మండలం వేగేయమ్మపేటకు చెందిన వాసంసేట్టి శ్రీనివాసరావు (49) హుండీ లెక్కింపు పనుల్లో గుమిగూడిన సిబ్బంది కళ్లుగప్పి రూ.60,000 దొంగిలించి పారిపోవడానికి ప్రయత్నించగా, ఆలయ E.O, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రదర్ రావు సిబ్బందితో కలిసి అతన్ని పట్టుకొని ఆత్రేయపురం పోలీసులకు అప్పగించారు. తదుపరి SI ఎస్. రాము కేసు నమోదు చేశారు.

దర్యాప్తు ఆదేశాలు అందుకున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా SP రాహుల్ మీనా, IPS మార్గదర్శకత్వంలో, కొత్తపేట DSP సుంకర మురళీమోహన్ పర్యవేక్షణలో రావులపాలెం రూరల్ CI విద్యాసాగర్, SI ఎస్. రాము కేసును వేగంగా విచారించి నిందితుడిని అరెస్టు చేశారు.

తరువాత కొత్తపేట గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరు పరచగా, మేజిస్ట్రేట్ జస్వంత్ యాదవ్ నిందితుడికి 14 రోజుల న్యాయ పరిరక్షణ (జ్యుడీషియల్ రిమాండ్) విధించారు. అనంతరం అతన్ని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.

పవిత్ర ఆలయ ప్రాంగణంలో ఇలాంటి చర్యలకు తావులేదని, ఎవరైనా ఇలాంటి అకృత్యాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని రావులపాలెం రూరల్ CI విద్యాసాగర్ స్పష్టంచేశారు.

17
414 views