logo

మంత్రి ఫరూక్ ను కలిసిన నంద్యాల టీవీ టెక్నీషియన్స్ అసోసియేషన్.

నంద్యాల (AIMA MEDIA): నంద్యాల టీవీ టెక్నీషియన్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్. ఎమ్.డి. ఫరూక్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి అర్హులైన టీవీ టెక్నీషియన్స్ కు ఇళ్లస్థలాలు కేటాయించ మని వినతిపత్రం సమర్పించారు.టీవీ టెక్నీషియన్స్ కు మెప్మా ద్వారా శిక్షణ ఇప్పించారని,టీవీ టెక్నీషియన్ లో చాలామంది పేదవారు ఉన్నారని వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని, మెప్మా ద్వారా రుణాలు అందజేయడానికి సహకరించాలని నంద్యాల జిల్లా టీవీ టెక్నీషియన్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, అధ్యక్షులు కన్నయ్య,నంద్యాల పట్టణ టీవీ టెక్నీషియన్స్ సంఘం అధ్యక్షులు జయపాల్ మంత్రికి వివరించారు.ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ అర్హులైన వారికి తప్పనిసరిగా ఇల్లు లేదా ఇంటి స్థలాలు కేటాయించి సహాయం చేస్తామన్నారు. తమ వినతికి సానుకూలంగా స్పందించిన మంత్రి ఫరూక్ కు అసోసియేషన్ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ కార్యదర్శి వెంకట శివ యాదవ్, ఉపాధ్యక్షులు మహబూబ్ బాషా, సంయుక్త కార్యదర్శి ఎల్లా గౌడ్, కోశాధికారి వీరారెడ్డి, సహకోశాధికారి కిషోర్ కుమార్, పట్టణ సంఘం గౌరవ అధ్యక్షులు పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

2
89 views