logo

దళితులు, గిరిజనులు, మైనార్టీలపై దాడులు ఆపాలి సిపిఐ డిమాండ్

దళితులు, గిరిజనులు, మైనార్టీలపై దాడులు ఆపాలి సిపిఐ డిమాండ్

ఈరోజు హిందూపురం పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది


ఈసందర్భంగా సిపిఐ హిందూపురం కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దళితులు, గిరిజనులు మరియు ముస్లిం మరియు క్రిస్టియన్ మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఆపాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా హిందూపురం తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం ఆర్ఐ గారికి వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో లౌకిక విధానాన్ని కాపాడాలని, మత విద్వేషాలు ఆపి ప్రజలందరికీ స్వేచ్ఛ కల్పించి, రాజ్యాంగ హక్కులను కాపాడాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నది.దళితులు మరియు గిరిజనులు, మైనార్టీలపైనా దాడులు పెరిగిపోతున్నాయని వీటిని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని దుయపట్టారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ హిందూపురం సహాయ కార్యదర్శి మారుతి రెడ్డి, కార్యవర్గ సభ్యులు చౌలురు రవికుమార్, నరసింహమూర్తి, చాంద్ బాషా, శ్రీనివాసులు ముత్యాలప్ప, సురేష్, మాబ్జాన్, సమివుల్లా తదితరులు పాల్గొన్నారు

3
442 views