logo

*గంజాయి అక్రమ రవాణా ప్రయత్నంలో ఒకరు అరెస్ట్*

శ్రీకాకుళం జిల్లా పోలీసు.
పత్రికా ప్రకటన.
జర్నలిస్టు : మాకోటి మహేష్

ll *గంజాయి అక్రమ రవాణా ప్రయత్నంలో ఒకరు అరెస్ట్* ll

ll *28 కిలోల నిషేధిత గంజాయి స్వాధీనం* ll

శ్రీకాకుళం, నవంబర్ 19:
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న A 1 అమిలైసా పాణి వ్యక్తిని ఇచ్చాపురం టౌన్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు అని ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.చిన్నం నాయుడు కేసు వివరాలు ఒక ప్రకటన ద్వారా తెలిపారు.ఒడిశా రాష్ట్రం, మోహన బ్లాక్, బాపూజీనగర్ వీధికి చెందిన అమిలైసా పాణి, అలాగే అతడితో కలిసి గంజాయి వ్యాపారం చేస్తున్న బీరజ్ ఎలియాస్ @ దరం బీర్ నాయక్ ఇద్దరూ 28 కేజీల నిషేధిత గంజాయిని ఒడిశాలోని కొండ ప్రాంతాల్లోని తెలియని వ్యక్తుల వద్ద నుండి గంజాయిని కొనుగోలు చేసి, మహారాష్ట్ర రాష్ట్రం ముంబై నగరంలోని కోపర్‌ఖైరేన్ ప్రాంతానికి చెందిన ఇంగలే రామేశ్వర్ అనే వ్యక్తికి సరఫరా చేస్తున్న క్రమంలో తేదీ 19.11.2025 మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో, నిందితులు 28 కిలోల గంజాయితో ఇచ్చాపురం రైల్వే స్టేషన్ నుండి రైలు ఎక్కి ముంబై వెళ్లి దాదర్ రైల్వే స్టేషన్ వద్ద ఇంగలే రామేశ్వర్‌కు సరఫరా చేయాలని క్రమంలో బీరజ్ ఎలియాస్ రైలు టికెట్లు తీసుకునేందుకు వెళ్లగా, అమిలైసా పాణి స్టేషన్‌ వద్ద గంజాయితో వేచి ఉండగా, ఇచ్చాపురం టౌన్ పోలీసు స్టేషన్‌ యస్‌.ఐ గారి తన సిబ్బందితో అప్రమత్తమై తనిఖీ చేసి అదుపులోకి తీసుకున్నారు.నిందితుడు వద్ద నుండి 28 కేజీల నిషేధిత గంజాయి,మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేపట్టారు.

3
25 views