logo

*ప్రభుత్వ అంధు ల పాఠశాలలో ఘనంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్ )33వ వార్షికోత్సవ వేడుకలు*


ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందరాజులు సేవా కార్యక్రమాలతో జాప్ వార్షికోత్సవం జరుపుకోవడం ఆనందం - డిఇఓ మాణిక్యం నాయుడు
జర్నలిస్టు సమస్యల పరిష్కారాన్ని కృషి - ఏడి గోవిందరాజులు జర్నలిస్టులకు అండగా జాప్ - రాష్ట్ర ఉపాధ్యక్షులు అవనాపు సత్యనారాయణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్ )33వ వార్షికోత్సవ వేడుకలు విజయనగరం ప్రభుత్వ అందుల పాఠశాలలో జిల్లా అధ్యక్షుడు ఎం రవిచంద్ర శేఖర్ అధ్యక్షతన ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి గోవిందరాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ 33 వ వార్షికోత్సవ కేక్ కటింగ్ పాఠశాల విద్యార్థులు తో కలిసి డీఈవో మాణిక్యం నాయుడు సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి గోవిందరాజులు జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అవనాపు సత్యనారాయణ జిల్లా అధ్యక్షులు మానాపురం రవిచంద్ర శేఖర్ ప్రధాన కార్యదర్శి అల్లాడ వెంకటరమణ ఉపాధ్యక్షులు సూరంపూడి రమేష్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వాడాడ గౌరీ శంకర్ కార్యదర్శులు హేమంత్ కుమార్ జి రామకృష్ణ నాయుడు కిషోర్ కోశాధికారి ఆదినారాయణ (కళా రవి ) జాప్ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ తిరుపతిరావు లోకేష్ ఆదినారాయణ తదితరులు జరిపించారు ఈ సందర్భంగా డిఇఓ మాణిక్యం నాయుడు మాట్లాడుతూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ 33 వ వార్షికోత్సవం సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం కార్యక్రమానికి హాజరు కావడం ఆనందాన్నిచ్చిందన్నారు సమాజంలో సమస్యలు వెలుగులోకి రావాలంటే జర్నలిస్టులు పాత్ర కీలకమన్నారు. జాప్ మరిన్ని సేవా కార్యక్రమాలతో మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని జర్నలిస్టు సమస్యలకు తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మీ గోవిందరాజులు మాట్లాడుతూ జర్నలిస్టులు వార్తలు రూపంలో సమస్యలు వెలుగు చూపడమే కాకుండా సేవా కార్యక్రమాలు చేయడం అందుల లో పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు జరపడం హర్షణీయమన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్ ) ఆవిర్భవించి 33 సంవత్సరాలు అయిందని నాటి నుంచి నేటి వరకు జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందన్నారు జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ అమలకు జాప్ వ్యవస్థాపకులు ఉప్పల లక్ష్మణ్ కృషితోనే సాధ్యమైంది అన్నారు జర్నలిస్టు సమస్యలతో పాటు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో అన్ని టీవీ ఛానల్ లో డిబేట్లో ప్రస్తావిస్తూ పరిష్కారాన్ని కృషి చేస్తున్న ఘనత ఉప్పల లక్ష్మణ్ అన్నారు జర్నలిస్టుల సమస్యల పట్ల జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఎప్పుడు అండగా ఉంటూ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు విజయనగరం జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ అమలయ్యే విధంగా కృషిచేసిన కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు అధ్యక్షులు మానాపురం రవిచంద్రశేఖర్ మాట్లాడుతూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్ట్ ల సమస్యల పోరాటం తో పాటు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జాప్ ప్రతినిధులు జర్నలిస్టులు ఫోటోగ్రాఫర్స్ వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.

0
323 views