logo

శ్రోతలను గానామృతం తో అలరించిన స్వరబృందావనం "మెలోడీ మెగా " 26 వ సంగీత విభావరి

హైదరాబాద్ : నవంబర్ 16 న ప్రముఖ బ్యానర్స్ లో ఒకటైన స్వరబృందావనం మెలోడీ మెగా, అద్భుతమైన గాయని గాయకుల మేళావింపుతో, అద్భుతమైన విజయం అందుకుంది. కార్యక్రమం అయిన 48 గంటలు గడవక ముందే దాదాపు 1000 views పొందడం అంటే మాములు విషయం కాదు.
స్వరబృందావనం బ్యానర్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు, గాయకులు మరియు anchor అయిన శ్రీ బృందావనం రవికాంత్ గారు మరియు సహా నిర్వాహకులు,గాయకులు శ్రీ తూములూరి శ్రీకుమార్ గారు నిన్న మీడియా తో మాట్లాడుతూ... స్వరబృందావనం 26 ఈవెంట్స్ ఇంత successful గా నడవడానికి కారణం, మొదటినుంచి శాశ్వత గాయని గాయకులు ఉండడం, పరస్పర సహకారం అందించుకుంటూ ఒక కుటుంబ వాతావరణాన్ని ఏర్పరిచారని వెల్లడించారు.
ఇతర బ్యానర్స్ లో లేనిది స్వరబృందావనం లో ఉన్నది ముఖ్యం గా 1. ఆత్మీయ అనుబంధం, 2.చక్కని అతిధ్యం 3. ఎక్కువ పాటలు ఇవ్వడం.... ఇలాంటి అద్భుతమైన అజెండా తో స్వరబృందావనం ముందుకు దూసుకువెళ్తోందని, అతి త్వరలో 100 పోగ్రామ్స్ చేస్తాము అని శ్రీ బృందావనం రవికాంత్ గారు తెలిపారు. డా. శ్రీనివాసుల జగదేశ్వరరావు గారు వారి పెద్దల్లుడు శ్రీ అమరనాధ్ గారి జన్మదినం సందర్భం గా cosponcer గా వ్యవహారించారు. గాయని గాయకుల ఫొటోస్ తో పాటు జగదేశ్వరరావు గారు family pics తో అద్భుతమైన టీజర్ రవికాంత్ గారు రూపొందించారు అని జగదేశ్వరరావు గారు స్వరబృందావనం నిర్వాహకులు అయిన శ్రీ బృందావనం రవికాంత్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రముఖ గాయని గాయకులు అయిన
శ్రీ విజయరాఘవన్, శ్రీ జగదేశ్వరరావు, శ్రీ శరత్ కృష్ణ, శ్రీ చైతన్య, శ్రీ kgr శాస్త్రి, శ్రీ వెంకట ప్రసాద్, శ్రీ k. రఘుబాబు, శ్రీనివాస్
మరియు
ప్రముఖ గాయని మణులు అయిన
శ్రీమతి v. రమాదేవి, శ్రీమతి సీతా కుమారి, శ్రీమతి లతా కుమారి, శ్రీమతి యశోద, శ్రీమతి దాము రాజేశ్వరి, శ్రీమతి రవిలక్ష్మి
తదితరులు తమ మధుర గానం తో అలరించారని నిర్వాహకులు అయిన శ్రీ బృందావనం రవికాంత్ గారు మరియు శ్రీ తూములూరి శ్రీకుమార్ గారు తెలిపారు. జనవరిలో స్టార్ మెగా నిర్వహిస్తామని త్వరలో వివరాలు తో ప్రకటన విడుదల చేస్తామని నిర్వాహకులు తెలిపారు.

90
7586 views