logo

మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి

క్రౌన్ హ్యూమన్ రైట్స్ బాపట్ల 18 నవంబర్ 2025 :
భారత ప్రభుత్వ సామాజిక న్యాయ మరియు సాధారికత మంత్రిత్వ శాఖ వారి ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు బాపట్ల జిల్లా దివ్యాంగులు, ట్రాన్స్న్ జెండర్స్ & సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో "నషా ముక్త్ భారత్ అభియాన్ "ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా జాతీయ స్థాయిలో నిర్వహించబడుతున్న "ఈ-ప్లేడ్జ్ " కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల నందు ఏర్పాటు చేయబడిన కార్యక్రమంలో సిహెచ్. సువార్త, అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులంతా మత్తు పానీయాలకు దూరంగా ఉండి విద్య మీదనే తమ దృష్టిని కేంద్రీకరించి జీవితంలో ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమానికి డాక్టర్ ఎం. రమాదేవి (ప్రిన్సిపాల్ -బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ )వారు పాల్గొన్నారు. బి.వెంకటేశ్వర్లు (ఎక్సైజ్ సూపరింటెండెంటు )మాట్లాడుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు. శ్రీ ఎండి సాధిక్ గారు (జిల్లా సైన్స్ అధికారి)
మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే విలువలు,క్రమశిక్షణ తో కూడిన జీవితాన్ని అవలంబిస్తూ మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాలని కోరారు.కే శ్రీనివాసరావు (రూరల్ సీఐ బాపట్ల) తమ ప్రసంగంలో మత్తు పదార్థాలు సేవించే వారికి చట్టపరంగా తీసుకొనే చర్యల గురించి తెలియజేశారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ డి. నిరంజన్ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులంతా చక్కటి క్రమశిక్షణతో మెలిగి జీవితంలో ఉన్నత శిఖరాన్ని అధిరోహించి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రముఖ ట్రైనర్ మరియు సైకాలజిస్ట్ పీ. అన్వేష్ మాట్లాడుతూ ఇంద్రియ నిగ్రహం మీద పట్టు సాధించడం ద్వారా మత్తు నుండి దూరంగా ఉండవచ్చునని సూచించారు. మరొక ట్రైనర్ యస్ డి.మతీన్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు మనిషిని శారీరకంగా,నైతికంగా ,
సామాజికంగా, ఆర్థికంగా దిగజారుస్తాయని వాటి బారినపడి జీవితాన్ని నరకమయం చేసుకోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఈగల్ టీం ప్రతినిధులు దుర్గాప్రసాద్ , సురేష్ పాల్గొన్నారు . డీ.ఎస్. రజని ( ప్రిన్సిపాల్- ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాల వెదుళ్ళపల్లి ) పాల్గొన్నారు. ఎస్ డి. నాగూర్ బాష
శ్రీ చైతన్య కళాంజలి రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (ఇంటిగ్రేటెడ్ రిహబిలిటేషన్ సెంటర్ ఫర్ అడిక్ట్స్) చిన్నగంజాం మాట్లాడుతూ తమ రిహాబిలిటేషన్ సెంటర్ నందు మత్తు పదార్థాలకు బానిస అయినటువంటి వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో పూర్తి ఉచితంగా భోజన, వసతి సౌకర్యాలతో వైద్య మరియు మానసిక చికిత్సలను అందించడం ద్వారా ఆ జాడ్యం నుండి విముక్తుల్ని చేసి వారిని సాధారణ వ్యక్తులుగా మార్చటం జరుగుతుందని ఎవరైనా ఈ విధంగా మత్తు పానీయాలకు బానిసలు అయిన వ్యక్తులు ఉంటే వారిని తమ సెంటర్లో చేర్పించవలసిందిగా కోరారు.
బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు మొత్తం 4200 మంది "ఈప్లేడ్జ్ " లో పాల్గొన్నారు.

4
211 views